బ్రిటన్ : రిషి సునాక్ దంపతుల ‘‘గో పూజ’’... వీడియో వైరల్

బ్రిటన్ ప్రధాన మంత్రి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మద్ధతు కూడగట్టేందుకు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

ముఖ్యంగా భారతీయులను ఆకట్టుకునేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు.

తాజాగా రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ‘‘గో పూజ’’లో పాల్గొన్నారు.వారిద్దరూ గోమాత పక్కన నిలబడి హారతి ఇచ్చారు.

ఆవుకు నీళ్లు తాగించి.పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ గోమాత ఆశీర్వాదం తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే.

Advertisement

కొద్దిరోజుల క్రితం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రిషి సునాక్ ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.హిందూమత విశ్వాసాలను గట్టిగా పాటించే రిషి సునాక్.2019లో హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన సమయంలో భగవద్గీతపై చేతులు పెట్టి ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

కాగా.తొలుత ఒక్కో అభ్యర్ధిని దాటుకుంటూ టాప్‌లో కొనసాగిన రిషికి ప్రస్తుతం లిజ్ ట్రస్ గట్టి పోటీనిస్తున్నారు.డిబేట్‌లు, సర్వేల్లో సునాక్ తేలిపోతున్నారు.

ఇటీవల కన్జర్వేటివ్ పార్టీ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో లిజ్ ట్రస్ ముందంజలో నిలిచిన సంగతి తెలిసిందే.సదరు పోల్‌లో 961 మంది కన్జర్వేటివ్ సభ్యులు పాల్గొన్నారు.

ఇందులో లిజ్ ట్రస్‌కు 60 శాతం మంది జైకొట్టగా, రిషికి కేవలం 28 శాతం మంది మాత్రమే మద్ధతుగా నిలిచారు.ఇద్దరి మధ్యా 32 శాతం ఓట్ల తేడా వుండటంతో బ్రిటీష్ తదుపరి ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపడతారని కథనాలు వస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అయితే తుది ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున రిషి తనను తాను నిరూపించుకునేందుకు శ్రమిస్తున్నారు --.

Advertisement

తాజా వార్తలు