వివాహ వేడుకలకు( Wedding ) సంబంధించి ఇంటర్నెట్‌లో ఎన్నో వీడియోలు మనకు కనిపిస్తుంటాయి.ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇక వివాహాలు అయితే విభిన్నంగా చేసుకోవాలని అంతా భావిస్తున్నారు.కొందరు వధువులు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఓ వరుడికి వధువు కుటుంబం వారు పెట్టిన వింత కండిషన్లు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా ఇలాంటి ఎక్కడా చూసి ఉండం.
పెళ్లి జరిగే సమయంలో తమ కుమార్తెను బాగా చూసుకోవాలని, ఏవైనా గొడవలు పడితే సర్దుకోవాలని వధువు తరుపు వారు వరుడికి( Groom ) చెబుతుంటారు.ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం ఎక్కడైనా సాధారణంగా జరుగుతుంది.

అయితే వధువు కుటుంబం ఓ అగ్రిమెంట్ పేపర్ మీద వింత కండిషన్లు రాసి, వాటిని వరుడు చేతిలో పెట్టారు.అవి చదివిన వరుడు అవాక్కయ్యాడు.ఆ అగ్రిమెంట్ పేపర్( Agreement Paper ) తీసుకుని వివాహ వేదిక వద్ద తికమకగా తిరిగాడుచివరికి అందులో వధువు కుంటుంబం ఏం రాసిందో చదివి, దానిపై సంతకం పెట్టాడు.వధువును షాపింగ్‌కు తీసుకెళ్లాలి.ఆమెకు చలి వేస్తే దుప్పటి కప్పాలి.వధువుకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి.
ఆమెతో ఎల్లప్పుడూ ప్రేమగా ఉండాలి.ఎప్పుడూ ఆమె చెప్పిందే కరెక్ట్ అని అనుకోవాలి.

కనీసం సంవత్సరానికి 3 సార్లు అయినా ఇతర ప్రాంతాలకు టూర్లకు( Tours ) తీసుకెళ్లాలి.ఆమెకు సంతోషం కలిగించే పనినే చేయాలి.ఈ కండిషన్లకు ఒప్పుకుంటే మా పిల్లను మీకిస్తాం అని వారు అందులో పేర్కొన్నారు.మొదట ఇవి చూడగానే వరుడు కంగారు పడ్డాడు.తర్వాత ఆమె పట్ల ఆమె కుటుంబం ఎంత ప్రేమగా ఉందో తెలుసుకుని దానిపై సంతకం పెట్టాడు.ఈ వీడియోను @kajeswani అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లి తర్వాత నీ పరిస్థితి కష్టం అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.







