క్రికెట్ లో భారత జట్టు మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) సాధించిన రికార్డులు బద్దలు కొట్టడం అంటే ఆషామాషీ కాదు.ఎవరికి సాధ్యం కానీ, ఎవరు బ్రేక్ చేయలేని రికార్డులు సృష్టించడంలో సచిన్ టెండుల్కర్ కు ఎవరు సాటిలేరు.
ఈ విషయం భారత క్రికెట్ అభిమానులకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులకు కూడా తెలిసిందే.
అయితే ప్రస్తుత తరంలో భారత జట్టు రన్ మిషన్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) 100 సెంచరీల రికార్డుకు చేరువలో ఉన్నాడు.
అయితే సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా( Brian Lara ) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 80 సెంచరీలు చేశాడు.100 సెంచరీలు( 100 Centuries Record ) పూర్తి అవ్వాలంటే మరో 20 సెంచరీలు చేయాలి.ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు.ఇప్పటినుంచి ప్రతి సంవత్సరానికి 5 సెంచరీలు చొప్పున చేసిన.100 సెంచరీల మైలురాయి చేరాలంటే ఐదేళ్లు పడుతుంది.అప్పటికి విరాట్ కోహ్లీ వయసు 39 సంవత్సరాలు ఉండనుంది.ఆ వయసులో సెంచరీలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నది.కాబట్టి విరాట్ కోహ్లీ 100 సెంచరీల మైలురాయిని చేరడం కష్టమే అని బ్రియాన్ లారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

అయితే ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ అయిన కోహ్లీ ఈ రికార్డ్ కచ్చితంగా సాధించలేరని చెప్పలేను.కోహ్లీ ఫిట్నెస్( Kohli Fitness ) ముందు వయస్సు ఏ మాత్రం అడ్డం కాదని లారా తెలిపాడు.విరాట్ కోహ్లీ ఇలాగే ఫిట్నెస్ మైంటైన్ చేస్తే కచ్చితంగా 100 సెంచరీల మైలురాయిని దాటి సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందని బ్రియాన్ లారా చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది.