ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫొటోలో అప్పుడే పుట్టిన బేబీ చాలా సీరియస్‌గా ఫేస్ పెట్టి కనిపించింది.
సాదారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు కనీసం కళ్లు కూడా తెరవకుండానే గుక్క తిప్పుకోకుండా ఏడుస్తారు.కొన్ని సార్లు ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా అబ్బా ఏంటీ ఏడుపు అనుకుంటారు.
అప్పుడే పుట్టిన పిల్లలు ఏడవడం కూడా మంచిదే అంటారు.అప్పుడే పుట్టిన బేబీ ఏడవకుంటే వారిని కొట్టి మరీ ఏడిపిస్తూ ఉంటారు.
ఈ బేబీ మాత్రం చాలా ప్రత్యేకంగా కనిపించింది.
బ్రెజిల్‌లోని ఒక హాస్పిటల్లో ఒక మహిళకు సిజేరియన్ చేసి బేబీని బయటకు తీయడం జరిగింది.
ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత బేబీని బయటకు తీసి బొడ్డు కట్ చేస్తారు.అలా బొడ్డు కట్ చేసిన సమయంలో డాక్టర్ వైపు ఈ బేబి చాలా సీరియస్‌గా చూయడటం జరిగింది.
కనీసం ఏడవకుండా కళ్లు అలా పెద్దవి చేసి చూసి డాక్టర్‌కు ఏదో వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇలాంటి లుక్ ఇవ్వడం జరిగింది.హాయిగా ఉన్న నన్ను ఎందుకు బయటకు తీశావు అన్నట్లుగా డాక్టర్ ను ఈ బేబీ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫొటో సెన్షేషనల్ అవుతుంది.

బొడ్డు కట్ చేస్తున్న సమయంలో నొప్పిగా ఉండి పిల్లలు ఏడుస్తారు.కాని ఈ బేబి మాత్రం కనీసం నోరు విప్పలేదు.పుట్టిన తర్వాత చాలా గంటల వరకు కళ్లు పూర్తిగా ఓపెన్ చేయలేరు.
కాని ఈ బేబి మాత్రం కొన్ని నిమిషాలు కూడా కాకుండా కళ్లు ఓపెన్ చేయడం, అది కూడా చాలా సీరియస్ ఫేస్‌తో కళ్లు చిట్లిస్తూ చూడటం చూసి అక్కడున్న వారు అంతా అవాక్కయ్యారు.డాక్టర్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దీన్ని ఇప్పుడు కొన్ని మిలియన్ల మంది షేర్ చేస్తున్నారు.