కర్ణాటకలో ఆర్‌ఆర్ఆర్ బ్యాన్ డిమాండ్‌... అసలు కారణం ఇదేనా?

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన హడావుడి కనిపిస్తుంది.

జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా స్క్రీనింగ్‌ కు సిద్దం అయ్యింది.

ఈ సమయంలో కన్నడకు చెందిన కొందరు ప్రజలు సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా ను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.ఈ వ్యవహారం కాస్త సీరియస్ టర్న్ తీసుకోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా కర్ణాటక రైట్స్ ను కొనుగోలు చేసిన బయ్యర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సినిమా కర్ణాటక లో విడుదల అయ్యేనా.విడుదల అయిన తర్వాత థియేటర్లలో వారు నడువ నిచ్చేనా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ఈ వివాదంకు కారణం ఏంటీ.అసలు ఎందుకు ఈ వివాదం రాజుకుంది అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు.అసలు విషయం ఏంటీ అంటే.

Advertisement

కర్ణాటక లో ఈ సినిమా ను కన్నడం లో డబ్‌ చేసి విడుదల చేయడం లేదు.తమిళం, మలయాళం, హిందీ ల్లో డబ్‌ చేసి విడుదల చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు కన్నడం లో మాత్రం ఎందుకు డబ్బింగ్ చేయలేదు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

కర్ణాటక లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించి సినిమా పై అంచనాలు పెంచారు.కాని ఎందుకు కన్నడ వర్షన్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను తీసుకు రావడం లేదని అంతా ప్రశ్నిస్తున్నారు.

కన్నడం లో పాట లను కూడా విడుదల చేశారు.కాని సినిమా విడుదల విషయం లో మాత్రం అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

మరి చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేది చూడాలి.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు