షారుఖ్ 'పఠాన్'కు బాయ్ కాట్ సెగ.. ఈసారి కూడా ఆశలు గల్లంతే!

బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అయితే ఈయన మాత్రం కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.

షారుఖ్ ఖాన్ చేసిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అందుకుంటున్నాయి.ఆయన చివరిసారిగా జీరో సినిమాతో వచ్చాడు అయితే ఈ సినిమాతో భారీ ప్లాప్ అందుకోవడమే కాదు జీరో సినిమాతో వచ్చి జీరో అయ్యాడు అంటూ విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు.

ఈ సినిమా దెబ్బతో కింగ్ ఖాన్ ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు.విజయం సాధించి చాలా కాలం అవుతుండడంతో.

సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.అందుకే ఈసారి షారుఖ్ గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది.

Advertisement

అయితే ఈయనకు మళ్ళీ ఎదురు దెబ్బ తగలబోతుందా అనే చర్చ నడుస్తుంది.ఎందుకంటే ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అవుతున్న బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది.

మరి ఈ ట్రెండ్ వల్ల చాలా సినిమాలు కోట్లకు కోట్లు నష్టపోతున్నాయి.ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాకు కూడా ఇదే సెగ తగిలేలా ఉంది.ప్రెసెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో పఠాన్ ఒకటి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు.

బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా దీపికా నటిస్తుంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వగా ఇందులో దీపికా దుస్తుల విషయంలో విమర్శలు వచ్చాయి.దీంతో ఈ సినిమాకు కూడా బాయ్ కాట్ సెగ తగల బోతుంది.

Advertisement

చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో.

తాజా వార్తలు