టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను. ఈయన సినిమాలు తీసే విధానం, అందులో చూపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.
ఒక్కో సినిమా యాక్షన్ మరీ ఎక్కువ అయ్యి ప్లాప్స్ ఎదురైనా ఈయనకు మాగ్జిమమ్ హిట్ లే వచ్చాయి.ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.
అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.
ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మరొక రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
జులై 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక రామ్ ఈ సినిమా రిలీజ్ అయినా వెంటనే బోయపాటితో షూట్ లో పాల్గొనబోతున్నాడు రామ్.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాను బోయపాటి పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్ద బోతున్నాడు.
అందుకే రామ్ కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఆర్టిష్టులను ఈ సినిమాలో భాగం చేయబోతున్నాడట.ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్ బయటకు వచ్చింది.మరి ఆ హీరో ఎవరు అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇప్పుడు రిలీజ్ కాబోతున్న వారియర్ సూపర్ హిట్ అయితే బోయపాటి సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.