బౌల్ట్ మిరేజ్ స్మార్ట్ వాచ్ లో సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే..!

యువతను అట్రాక్ట్ చేయడం కోసం ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ బౌల్డ్ ఆడియో( Boult Audio ) ఓ స్మార్ట్ వాచ్ ను సరికొత్త ఫీచర్లతో భారత మార్కెట్ లోకి విడుదల చేసింది.

స్మార్ట్ వాచ్ కు సంబంధించిన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్ వివరాలు ఏమిటో చూద్దాం.బౌల్డ్ ఆడియో కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ వాచ్ పేరు బౌల్డ్ మిరేజ్.( Boult Mirage ) భారత మార్కెట్లో ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.2199 గా ఉంది.అయితే ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.1799 కే పొందవచ్చు.ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ తో( Flipkart ) పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

Boult Mirage Smartwatch New Features And Specifications Details, Boult Mirage Sm

బౌల్డ్ మిరేజ్ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే.ఈ వాచ్ 1.33 అంగుళాల హెచ్ డి డిస్ ప్లేతో ఉంటుంది.ip 67 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.

ఇన్ బిల్డ్ మైక్, స్పీకర్, 120 స్పోర్ట్ మోడ్లు ఉంటాయి.బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో( Bluetooth Calling ) ఉంటుంది.

Advertisement
Boult Mirage Smartwatch New Features And Specifications Details, Boult Mirage Sm

బిల్డ్ ఇన్ హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ ట్రాకర్ ఉంటాయి.

Boult Mirage Smartwatch New Features And Specifications Details, Boult Mirage Sm

స్మార్ట్ ఫోన్ కు వచ్చే కాల్స్, మెసేజెస్ అలాగే వివిధ యాప్స్ ద్వారా వచ్చే నోటిఫికేషన్లు, వెదర్ ఫోర్ కాస్ట్( Weather Forecast ) వంటివి వాచ్ లో ఉంటాయి.ఒకసారి బ్యాటరీ ఫుల్ చేస్తే ఏడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు