ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై స్పందించిన బొత్స సత్యనారాయణ.. !

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢీల్లీ పర్యటన పై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే జగన్ ఢీల్లీ పర్యటన పై టీడీపీ నేతలు పలు విధాలుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటనపైనా స్పందించిన బొత్స.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢీల్లో వెళ్లితే ఈ పర్యటనను అడ్దం పెట్టుకుని టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

Botsa Satyanarayana Responds To Ap Cm Jagan Delhi Tour, AP, CM Jagan, Delhi, Bot

ఇక ఢీల్లీ పర్యటన రెండు రోజుల క్రితం రద్దవ్వగా దాని మీద కూడా విమర్శలు చేసిన పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు జగన్ కు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరకడంతో మరోలా దుష్ప్రచారం చేస్తున్నారని వీరికి రాష్ట్ర అభివృద్ధికంటే ఆ అభివృద్ధిని అడ్డుకుంటూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు.ఇలా విమర్శిస్తున్న టీడీపీ నేతలకు చేతనైతే సీఎంకు సూచనలు, సలహాలు ఇవ్వండి అంటూ హితవు పలికారు.

ఇకపోతే రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకే జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ.

Advertisement
అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

తాజా వార్తలు