మహేష్ మాటలతో భగ్గుమన్న బాలీవుడ్..వివాదం చేసే పనిలో స్టార్స్

ఈ రోజు మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ లు జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల అయ్యి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుని విజయవంతంగా ప్రదరించబడుతోంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు మహేష్ బాబు సొంత నిమన సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

 Bollywood Vs Mahesh Babu, Mahesh Babu , Sarakaruvari Pata , Bollywood , Pre Rele-TeluguStop.com

ఇక ఈ సినిమాను అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించారు.మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రెండు రోజులు గడిస్తే కానీ ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేయడం కష్టం.ఇదిలా ఉంటే, ఇటీవల మేజర్ సినిమా ట్రెయిలర్ లాంచ్ సమయంలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర గందరగోళాన్ని మరియు వివాదాలకు నెలవుగా మారాయి.

మేజర్ ట్రైలర్ లాంచ్ లో చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యంగా బాలీవుడ్ మరియు జాతీయ మీడియా టాలీవుడ్ ను అలాగే ఈ వివాదానికి కారణం అయిన మహేష్ బాబు ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

అయితే అస్సలు మహేష్ బాబు ఏమంటే… ఇంతలా అంటున్నారు అన్నది చూస్తే, బాలీవుడ్ మీడియా మహేష్ ను ఉద్దేశించి మీరు భవిష్యత్తులో బాలీవుడ్ లో సినిమాలు చేస్తారా? అన్నారు… దానికి మహేష్ నాకు టాలీవుడ్ లో చాలా కంఫర్ట్ గా ఉంది.ఇక్కడ నాకు మంచి ఆదరణ దక్కుతోంది.నాకు బాలీవుడ్ నుండి చాలా ఆఫర్ లు వస్తున్నా నేను వెళ్ళడానికి ఇష్టం లేదు.అక్కడి వారు నన్ను భరించలేరు అనుకుంటున్నా అన్నాడు ఎందుకంటే… తెలుగు సినిమాను దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ ఇష్టపడే సినిమాను తీయాలి.ఇక్కడ నేను అన్ని విధాలుగా బాగున్నపుడు మళ్లీ వేరే ఇండస్ట్రీలో వచ్చి సినిమాలు తీయాల్సిన అవసరం అయితే లేదు కదా, ఇక్కడ సినిమాలు చేసి బాలీవుడ్ లో ఆదరణ దక్కేలా కష్టపడుతామని చెప్పాడు.

ఇప్పటికే టాలీవుడ్ నుండి బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.దీని వివాదం చేస్తున్నప్పుడు మహేష్ బాబు పి ఆర్ టీమ్ ముందుకు వచ్చి తగిన వివరణ ఇచ్చారు.

మహేష్ బాబు బాలీవుడ్ ను కించపరిచేలా అనలేదు.ఇప్పుడు తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ ఇండియా వైడ్ ఆదరణను దక్కించుకుంటుంది.

ఈ సమయంలో నేను మరొక పరిశ్రమకు రావడం కుదరదు అన్నారు.అంతే కాదు మహేష్ కు అన్ని భాషల ఇండస్ట్రీలు సమానమే అని క్లారిటీ ఇచ్చారు.

Telugu Bollywood, Kannada, Mahesh Babu, Pre Relese, Sudeep, Tollywood-Latest New

అయితే మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ ప్రజలు మరియు ప్రముఖులు వేరొక విధంగా అర్దం చేసుకుని టాలీవుడ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇప్పుడు వార్ బాలీవుడ్ టాలీవుడ్ గా మారిపోయింది.అంటే… బాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లకు మంచి సినిమాలు తీయడం రాదా ? టాలీవుడ్ కు మాత్రమే సినిమాలను తీయడం తెలుసా అన్న రీతిలో ప్రశ్నలు కురిపిస్తున్నారు.అయితే బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏవీ కూడా సొంత ప్రజల ఆదరణకు నోచుకోలేదు.

ఎన్నో అంచనాలతో వచ్చిన భారీ సినిమాలు సైతం బురిడీ కొట్టాయి.అయితే మహేష్ మాటల్లో ఎక్కడా కూడా బాలీవుడ్ సినిమాను అవమానించినట్లు లేదు.మరి ఎందుకో.బాలీవుడ్ ఇంతలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది అర్దం కావడం లేదు.

ఆ విధంగా చూసుకుంటే గతంలో అస్సలు సౌత్ సినిమాను పరిగణలోకి తీసుకునే వాళ్ళు కాదు బాలీవుడ్.ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే చెప్పుకునేవారు.

అంతెందుకు గతంలో ఒక ఫంక్షన్ కోసం చిరంజీవి ముంబై వెళితే అక్కడ తెలుగు సినిమాకు ఏమాత్రం గౌరవం లభించకపోగా, ఒక్క తెలుగు నటుడి ఫోటో కూడా అక్కడ ఉంచకపోవడం ఎంతగానో బాధించింది అని ఇటీవల చిరంజీవి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.

Telugu Bollywood, Kannada, Mahesh Babu, Pre Relese, Sudeep, Tollywood-Latest New

అలాంటి సమయంలో సౌత్ సినిమా బాలీవుడ్ పై విమర్శలు చేసింది లేదు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దక్షిణ సినిమా నుండి మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన సినిమాలు బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్ లు సాధించి గత చిత్రాల పేరిట ఉన్న రికార్డు లను తిరగరాశాయి. బాలీవుడ్ లో కింగ్ లని చెప్పుకునే హీరోల చిత్రాలు కూడా బాలీవుడ్ ను మెప్పించలేక పోతున్నాయి.

కానీ సౌత్ సినిమా నుండి మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు హిట్ లను సాధిస్తూ బాలీవుడ్ ను అణగదొక్కేస్తున్నాయి.అందుకే దీనికి ఓర్వలేక దొరికిన ఈ చిన్న లూప్ ను పట్టుకుని సాధిస్తున్నారు అంటూ సౌత్ ఇండస్ట్రీలు అంటున్నాయి.

వరుసగా వస్తున్న సౌత్ పాన్ ఇండియా సినిమాల విజయమే… బాలీవుడ్ ఇలా అవడానికి కారణమని తెలుస్తోంది.అందుకే సౌత్ ఇండియా నుండి ఎవరు ఏమి మాట్లాడినా వివాదం చేస్తున్నారు.

అందులో కన్నడ హీరో సుదీప్ మరియు మహేష్ బాబు లు ఉన్నారు.ఇక ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube