ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఆర్.ఆర్.ఆర్ నటుడు అజయ్ దేవగణ్.. కారు ఖరీదెంతంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్( Ajay devgn ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అజయ్ దేవగన్ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Bollywood Star Hero Ajay Devgn Buys Costly Bmw Car, Ajay Devgn, New Car, Bollywo-TeluguStop.com

కాగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల దృశ్యం 2( Drishyam 2 ) సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అజయ్ దేవగణ్.

శ్రియా శరణ్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ ని సొంతం చేసుకుంది.

మలయాళంలో సూపర్ హిట్ అయినా చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించారు.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో అజయ్ దేవగణ్ ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేశాడు.ఆ వివరాల్లోకి వెళితే.

హీరో అజయ్ దేవగణ్ తాజాగా ఒక కారుని కొనుగోలు చేయగా ఆ కారు ఖరీదు దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.అజయ్ దేవగణ్ బీఎండబ్ల్యూ ఐ7( Bmw car ) ఈవీ కారును జర్మన్‌ కంపెనీ తయారు చేసింది.

ఇండియన్ మార్కెట్లో రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది.అజయ్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారులో ఆధునాతన సదుపాయాలు ఉన్నాయి.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు అజయ్ దేవగణ్.కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్లలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు అజయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube