బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సౌత్ సినిమాలు ఇవే

బాహుబలి సినిమా వచ్చిన తర్వాత యావత్ చిత్ర పరిశ్రమలో సినిమా లెక్కలు పూర్తిగా మారిపోయాయి.అంతకుముందు సౌత్ ఇండియాలో హిందీ సినిమాలు విడుదలై రికార్డులు సృష్టించేవి.

కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది సౌత్ ఇండియాలో విడుదలైన సినిమాలు బాలీవుడ్ లో రికార్డుల బద్దలు కొడుతున్నాయి.బాహుబలి సినిమా తర్వాతే ఈ ప్రభంజనం మొదలైంది ఆ తర్వాత వచ్చిన కేజిఎఫ్ ఆర్ఆర్ కార్తికేయ వంటి సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క ఖ్యాతిని బాలీవుడ్ లో రుచి చూపించాయి.

అలా బాలీవుడ్ లో విడుదలై రికార్డులు సృష్టించిన తెలుగు సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

కార్తికేయ 2

ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం రికార్డులను సృష్టిస్తుంది.

ఈ సినిమా ముందు బాలీవుడ్ లో ఖాన్ ల సినిమాలు కూడా పక్కకెళ్ళిపోయాయంటే మామూలు విషయం కాదు.ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లు దాటి కలెక్షన్స్ రాబట్టింది.

Advertisement

ఇక బాలీవుడ్ లో 25 కోట్ల వసూళ్లు సృష్టించింది.

కబాలి

సౌత్ లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల బిజినెస్ చేసింది.

విడుదలకు ముందు నుంచి కబాలి సినిమాపై భార్య అంచనాలు ఉండగా బాలీవుడ్లో 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

కే జి ఎఫ్

కన్నడ సినిమా పరిశ్రమలో విడుదలైన యష్ కేజీఎఫ్ చిత్రం బాలీవుడ్లో 45 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

పుష్ప

ఇక తొలిసారి ప్లాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ చేసిన పుష్పా సినిమా బాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించడంతోపాటు 108 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

బాహుబలి

ప్రభాస్ అనుష్క కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఒక్క బాలీవుడ్ లోనే 150 కోట్లు వసూలు చేసింది.

సాహో

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

బాహుబలి సినిమాల విజయం తర్వాత ప్రభాస్ మరోసారి బాలీవుడ్ దుమ్ము దులిపాడు.అతడు నటించిన సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేయగా కేవలం బాలీవుడ్ లోనే 150 కోట్లు వసూలు చేస్తుంది.

రోబో 2.0

Advertisement

రజనీకాంత్ హీరోగా రోబో కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో 180 కోట్ల రూపాయలు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 709 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

RRR

రామ్ చరణ్ తారక్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వర్షం కురిపించింది ఒక్క బాలీవుడ్ లోనే 300 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్స్ ఆఫీసు దుమ్ము దులిపింది.

కేజీఎఫ్ 2

బాలీవుడ్ లో ఎవ్వరు ఊహించని విధంగా 450 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేజిఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్లకు పైగా వసూలు చేసింది.

బాహుబలి 2

బాహుబలి మొదటి సినిమాతో ఘనవిజయం సాధించిన తర్వాత బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేయగా ఒక్క బాలీవుడ్ లోనే 500 కోట్లు వసూలు చేసింది.