బాలీవుడ్ హీరోయిన్స్ సైడ్ బిజినెస్ మాములుగా లేదు కదా !

అవకాశం ఉన్నప్పుడే అందినంత దోచుకోవాలి.కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

అచ్చంగా ఇదే ప్రయోగం చేస్తున్నారు అందాల తారలు.టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూనే వ్యాపార ప్రకటనలు చేస్తున్నారు.

అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.ఇంతకీ ఏ భామ ఏ వ్యాపారం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కత్రినా కైఫ్

Bollywood Heroines And Their Side Businesses, Label Life, Katrina Kaif,deepika P

బాలీవుడ్ లో మాంచి ఊపు మీదున్నఈనటి కూడా వ్యాపార రంగంలో రాణిస్తోంది. నైకా కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టింది.ఆన్ లైన్ ఉత్పత్తుల కంపెనీ లిస్టింగ్ అయిన రోజునే భారీగా లాభాలు అందుకుంది.అందులో భాగంగా తననకు రూ.22 కోట్లు దక్కాయి.అటు కే బ్యూటీ కాస్మొటిక్స్‌ కంపెనీలోనూ ఈమెకు వాటా ఉంది.

దీపిక పదుకొనే

Bollywood Heroines And Their Side Businesses, Label Life, Katrina Kaif,deepika P
Advertisement
Bollywood Heroines And Their Side Businesses, Label Life, Katrina Kaif,Deepika P

సినిమా రంగంలో మంచి ఊపు మీదున్నప్పుడే ఈ అమ్మడు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.కేఏ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఓ కంపెనీని స్థాపించింది.అటు ఎపిగామియా అనే ఎఫ్‌ఎంసీజీ సంస్థ, ఫ్రంట్‌ రో అనే ఎడ్యు స్టార్టప్‌లో నూ పెట్టుబడులు పెట్టింది.

అటు బ్లూ స్మార్ట్‌ అనే ఎలక్ట్రిక్‌ టాక్సీ స్టార్టప్‌లోనూ డబ్బు పెట్టింది.బెల్లాట్రిక్స్‌ అనే ఏరోస్పేస్‌ టెక్నాలజీతో పాటు కేఏ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.

అనుష్క

Bollywood Heroines And Their Side Businesses, Label Life, Katrina Kaif,deepika P

అటు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా పలు వ్యాపారాలు నడుపుతోంది.క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌కి ఓనర్ గా కొనసాగుతుంది.నుష్‌ పేరుతో ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ను రన్ చేస్తుంది.

విరాట్ తో కలిసి జిమ్ స్టూడియోల్లోనూ షేర్లు కలిగి ఉంది.

అలియా భట్

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ అమ్మడు కూడా వ్యాపారాలు బాగానే చేస్తుంది.కత్రినాతో కలిస నైకాలో పెట్టుబడులు పెట్టింది.ఎడ్ ఎ మమా అనే పేరుతో చిన్న పిల్లల దుస్తుల వ్యాపారం చేస్తుంది.

Advertisement

ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలో భాగస్వామిగా కొనసాగుతుంది.

సమంత

ఈ అమ్మడు సాకీ పేరుతో క్లోత్స్ బ్రాండ్ మొదలు పెట్టింది.ఓ జ్యువెల్లరీ కంపెనీలోనూ తనకి వాటాలున్నాయి.

ప్రీతి జింటా

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐపీఎల్‌ జట్టుకి ప్రీతి జింటా కో పార్ట్ నర్ గా ఉంది.అటు సౌత్ ఆఫ్రికాకు చెందిన స్టెలెన్‌బాష్‌ కింగ్స్‌ టీం కు కూడా తనే ఓనర్.ముంబైలో రెండు రెస్టారెంట్లు నడిపిస్తుంది.

పీఎన్‌జడ్‌ఎన్‌ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది.

మలైకా

ఈ పొడుగు కాళ్ల సుందరికి యోగా అంటే చాలా ఇష్టం అందుకే సర్వ, దివ అనే యోగా స్టూడియోలను ఏర్పాటు చేసింది.లేబుల్‌ లైఫ్‌ పేరుతో అమ్మాయిల కోసం ఫ్యాషన్ బ్రాండ్ ఏర్పాటు చేసింది.

శిల్పాశెట్టి

నటనకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగమ్మ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది.యోగాసనాలతో సీడీలు తయారు చేసి మార్కెట్ లోకి వదిలింది.ఆ తర్వాత యోగా స్టూడియోలు ఏర్పాటు చేసింది.

రెస్టారెంట్లను సైతం రన్ చేస్తుంది.లగ్జరీ స్పాలు కూడా నడిపిస్తుంది.

ఎస్ ఎస్ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ మొదలు పెట్టింది.అటు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ టీమ్ లో భాగస్వామిగా ఉంది.

తాజా వార్తలు