బాలీవుడ్‌ మొత్తంలో ఒకే ఒక్కడు... ఆశలన్నీ వాటిపైనే!

కరోనా ముందు వరకు బాలీవుడ్ బాక్సాఫీస్( Bollywood ) కలకలలాడుతూ ఉండేది.చిన్న సినిమాలు కూడా రూ.

100 కోట్లు అంతకు మించి కలెక్షన్స్ రాబడుతూ అందరికీ సంతోషకరంగా ఉండేది.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

కరోనా సమయం లో బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెల బోయింది.కరోనా పరిస్థితులు మెరుగు పడిన తర్వాత అయినా బాలీవుడ్ సినీ ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారని ఆశ పడితే నిరాశ మిగిలింది.

ఎంతో మంది స్టార్ హీరోలు సీనియర్ హీరో లు నటించిన సినిమా లు మినిమం వసూళ్లు కూడా రాబట్ట లేక చేతులెత్తేశాయి.ఒకప్పుడు తన ప్రతి సినిమా తో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన అక్షయ్ కుమార్ ఈ మధ్య పాతిక కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడమే ఇంకా ఘనంగా మారింది.

Bollywood Heroshah Rukh Khan Is Only Hope For Industry ,bollywood , Shah Rukh
Advertisement
Bollywood HeroShah Rukh Khan Is Only Hope For Industry ,bollywood , Shah Rukh

అలాంటి పరిస్థితుల నడుమ ఒక సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటే చాలా గొప్ప విషయం.కానీ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన పఠాన్ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.అదృష్టం కొద్ది ఆ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని.తదుపరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటూ అంతా ఆసక్తిని కనబరిచారు.

తాజాగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Bollywood Heroshah Rukh Khan Is Only Hope For Industry ,bollywood , Shah Rukh

పఠాన్‌ సినిమా మాదిరి గానే జవాన్ సినిమా( Jawan movie ) కూడా ఈజీగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఒకవైపు బాలీవుడ్ లో కరువు తాండవిస్తుంటే మరో వైపు షారుఖ్‌ మాత్రం ఇలా వందలకు వందలు.

వేలకు వేలు అన్నట్లుగా కలెక్షన్స్ రాబడుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.షారుక్ ఖాన్ నటించిన సినిమా లు ఎలాగూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

గనుక ముందు ముందు మా సినిమా లు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి అనే ఆశ తో ఇతర బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ నమ్మకం తో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు