మానవత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్... ఏం చేసాడంటే?

ప్రతి మనిషిలో అంతర్గతంగా ఏదో ఒక కళ ఉంటుంది.

దానిని బయట పెట్టుకోవాలంటే దానిని సానబెట్టుకొని ఒక ప్రొఫెషనల్ గా మన కళను అందరి అభిమానం పొందే విధంగా మార్చుకోవాలి.

అప్పుడు మనలోని టాలెంట్ తో మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి.కాని ఎంత టాలెంట్ ఉన్నా ఆర్థికంగా బలంగా ఉంటేనే మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది.

Farhan Akhtar Tweet On National Boxer Abid Khan, Farhan Akhtar, Abid Khan,Natio

మనం ఆర్థికంగా బలంగా లేకున్నా ఆర్థికంగా ప్రోత్సహించే వారు ఉన్నా మానసికంగా బలంగా ఉండి, వారి టాలెంట్ అనేది ప్రపంచానికి పరిచయం చేయబడుతుంది.అయితే అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆర్థికంగా సపోర్ట్ లేక గొప్ప టాలెంట్ ఉన్న బాక్సర్ ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఈ నార్త్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ జీవితానికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది.ఇక వీడియో నెట్టింట్లో వైరల్ అవగా ఇక ఆ నోటా, ఈ నోటా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ వద్దకు చేరింది.

Advertisement

ఈ వీడియోను చూసిన అక్తర్ అతని వివరాలు తెలుపవలసిందిగా కోరారు.తనకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రయత్నిస్తానని అక్తర్ తెలిపారు.

ఇక ఓ మానవతా దృక్పధంతో స్పందించిన ఫర్హాన్ అక్తర్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు