తెలంగాణలో పోడు సర్వేపై నీలినీడలు కమ్ముకున్నాయి.రాష్ట్రంలో పోడు సర్వే నిలిచిపోయింది.
చివరి దశకు వచ్చిన సమయంలో సర్వేకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.ఆయుధాలిస్తేనే పోడు సర్వేకు వెళ్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
వరుసగా మూడో రోజూ ఫారెస్ట్ సిబ్బంది నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిబ్బంది వినతిపత్రం ఇవ్వనున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి పోడు హక్కు పత్రాల జారీ కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి.పోడు సర్వే సైతం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మరోవైపు పోడు దరఖాస్తుల స్వీకరణ, గ్రామసభల నిర్వహణలో గందరగోళం నెలకొంది.అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న ఆందోళనలు సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.