విజయవాడ: బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.ఎపి లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
మంత్రులు ను మార్చడం కాదు.ముఖ్యమంత్రి నే మారిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది.
సత్యసాయి జిల్లాలొ వెనువెంటనే రెండు ఘటనలు జరిగాయి.నిన్న నెల్లూరు లో తుపాకీ తో ప్రేమోన్మాది కాల్చి చంపిన ఘటన విచారకరం.
రాష్ట్రం లో చిన్ని ఘటనలు జరుగుతున్నా సిఎం స్పందించరా.హోం మంత్రి ఈవిషయాల పై నోరు మెదపరా.
గవర్నర్ ను కలిసి రాష్ట్రం లో పరిస్థితి ని వివరిస్తాం.ఏది జరిగినా గంటలొ మీడియా ముందుకు వచ్చే మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు వీటి పై మాట్లాడరా.
ఉద్దేశపూర్వకంగా వైసిపి నేతలు స్పందించకుండా డైవర్ట్ చేస్తున్నారు.సంఘటనల పై సిఎం, హోం మంత్రి సమీక్ష ఎందుకు చేయలేదు.
క్రైం రేటులో, శాంతిభద్రతల విఘాతంలొ ఎపి ఉంది.దేశ వ్యాప్తంగా నేడు ఎపి లొ అరాచక పరిస్థితి గురించి చర్చించుకుంటున్నారు.
రాష్ట్రం లో మహిళలకు రక్షణ లేదు.అరాచకాలు పెరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు చోద్యం చూస్తున్నారు.
ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే వాటికి పొంతనే ఉండదు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోగా, ఉన్న వారిని తొలగించారు.
మూడేళ్ల ల్లో ఎంత మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలి.ఎపి లో ఉచిత విద్యుత్ ను ఎత్త వేసేందుకు కుట్ర జరుగుతుంది.
అందుకే కొత్త గా విద్యుత్ మీటర్లను అమలు చేస్తున్నారు.విపక్ష పార్టీ లు జగన్ మాయలో పడకండి.
ఏ రాష్ట్రమూ కొనుగోలు చేయని విధంగా ఎపి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.విద్యుత్ ఛార్జీలు చూసి ఇంట్లో ఫ్యాన్ కూడా వేయలేక పోతున్నారు.
ఇంట్లో తిరగని ఫ్యాన్ చూసి.ఈ పార్టీ కి ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
వైసిపి ని మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి తరమి కొట్టాలి.రాష్ట్రం లో సింహాలను చూసి ప్రజలు భయపడుతున్నారు.
సింహాల గుంపు అడవిలొ ఉండాలి… మిమ్మలను తరిమాలనే ప్రజలు చూస్తున్నారు.మా పొత్తుల పై వైసిపి నాయకులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు.
సజ్జల గారూ… మీ ప్రభుత్వం చేసిన మోసాలు అందరికీ అర్దమ అయ్యాయి.మీ పాలన గొప్ప అనుకుంటే.ముందస్తు ఎన్నికలకు రండి.వైఫల్యం చెందిన మీ ఎమ్మెల్యే లు ఎలా గెలుస్తారు.
వైసిపి నుండి వలసలు పెరగకుండా ఆపార్టీ నేతలు పొత్తుల ఎత్తులు వేస్తున్నారు.జనసేన, బిజెపి ఉమ్మడిగా 2024 లో అధికారంలోకి రావడం ఖాయం.
ఎపి లొ మంత్రులు, ఎమ్మెల్యే లకు ఠంఛనుగా జీతాలు ఇస్తున్నారు.కష్టపడి పని చేసే సిబ్బంది, ఉద్యోగాలకు జీతాలు లేవు.
పవన్ కళ్యాణ్ పై కొంతమంది అనవసర వివాదం చేస్తున్నారు.బిజెపి తప్ప… ఇతర పార్టీ ల పేరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చెప్పారా.
నేను బిజెపి తో కలిసి ముందుకు సాగుతా అని పవన్ స్పష్టంగా చెప్పారు కదా.ఓట్ల చీలిక ఉండదంటే… ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడతారా.సజ్జల, మంత్రులు పవన్, బిజెపి గురించి మాట్లాడుతున్నారంటే వారికి ఓటమి ఖాయమని అర్ధమైంది.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే… బిజెపి, జనసేన లకు ఓటు వేయమనే అర్ధం.