టీడీపీని టార్గెట్ చేసిన బీజేపీ! పార్టీలో కీలక నేతలకి గాలం

ఏపీలో వైసీపీ ప్రభంజనంలో టీడీపీ పార్టీ కేవలం 24 సీట్లకి పరిమితం అయిపోయింది.

ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ పార్టీకి అప్పట్లో తండ్రి గట్టి షాక్ ఇస్తే.

మళ్ళీ పదేళ్ళ 15 ఏళ్ల తర్వాత కొడుకు జగన్ మరింత గట్టిగా షాక్ ఇచ్చాడు.ఓ విధంగా జగన్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ కి చంద్రబాబు ఇంకా అయోమయంలోనే ఉన్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఇక జగన్ పరిపాలన మొదలెట్టి తాను చెప్పిన నవరత్నాలని ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.మరో వైపు టీడీపీ తీసుకున్న కీలక బిల్లులు, నిర్ణయాలపై జగన్ మళ్ళీ సమీక్ష చేస్తూ చాలా వాటిని రద్దు చేసేసారు.

అలాగే కొన్ని పథకాలకి పేర్లు మార్చేస్తున్నారు.అలాగే ఏపీ ఆర్ధిక లోటు పూడ్చేందుకు తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement

అయిన కూడా టీడీపీ పార్టీ శ్రేణులు బయటకి రాకుండా స్తబ్దుగానే ఉన్నారు.ఇక ఏపీలో టీడీపీ భారీ ఓటమి తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ అధిష్టానం ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

బీజేపీ పార్టీని ఏపీలో బలోపేతం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారని, ఇక పనిలో పనిగా టీడీపీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి వ్యూహాలని సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఇందులో భాగంగా టీడీపీ కీలక నేతలపై ద్రుష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా ముందుగా రాయలసీమ నుంచి బీజేపీ తన ప్లాన్ ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇక బీజేపీ ఇచ్చిన ఆఫర్ కి, అలాగే వైసీపీ నుంచి ఎదురుకాబోయే ప్రమాదం నుంచి సేఫ్ జోన్ లో ఉండాలంటే బీజేపీ బెటర్ ఆప్షన్ భావనలో రాయలసీమకి చెందిన టీడీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.

ఈ నేపధ్యంలో టీడీపీకి చెందిన చాలా మంది ఇప్పుడు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Raging Bull Casino App Vs. Casino Bonus Hunting : A Practical Comparison For Aussie Punters
Advertisement