గొంతు సవరించుకున్న కొండన్న.. నష్టం జరిగి పోయింది

తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా ఎగసి పడిన కెరటం తరహాలో పరిస్థితి ఉంది.ఆ మధ్య ఇక అధికారం దక్కించుకోవడమే తరువాయి అన్నంతగా బీజేపీ హడావుడి సాగింది.

బండి సంజయ్ మొదలుకుని జాతీయ నాయకత్వం హడావుడి చేసింది.తీరా చూస్తే పరిస్థితి తారు మారు అయ్యింది.

ఈ మధ్య కాలంలో బీజేపీ ని నమ్మే పరిస్థితి కనపడం లేదు.బీఆర్‌ఎస్ తో చీకటి ఒప్పందం ను బీజేపీ పెట్టుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయంలో నిజం ఎంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది అనుకుంటూ ఉండగా ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత కొండా విశ్వేశ్వరరెడ్డి( Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్‌( MLC Kavitha ) లో అరెస్ట్‌ చేసి ఉంటే కచ్చితంగా బీజేపీ పై తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడేది.

Advertisement

కానీ కవిత అరెస్ట్ కాకపోవడం తో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తన అభిప్రాయం ను వ్యక్తం చేశాడు.ఆయన మాటలను బట్టి చూస్తే కచ్చితంగా ఆయన బీజేపీ పై అసంతృప్తి తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇంతగా ఎందుకు బీజేపీ అంటూ అసంతృప్తి అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.ఈ సమయంలో ఆయన తన గొంతు సవరించుకుంటూ తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు.తాను నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు అన్నాడు.

అలాగే తాను బీజేపీకి దూరం అయ్యి మళ్లీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టి పారేశాడు.

జరిగిన నష్టం ను కవర్‌ చేసుకునేందుకు కొండా విశ్వేశ్వరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ అధినాయక్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.ఆయన కాంగ్రెస్ పార్టీ( Congress )లో జాయిన్ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

ఆయన మాత్రం బీజేపీ నుండి కదిలేది లేదు అంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు