“చంద్రబాబు” కి “జేవీఎల్” ఘాటు హెచ్చరిక..

Bjp Leader Jvl Strong Warning To Ap Cm Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు పై బీజేపి నేతలు తీవ్రమైన స్థాయిలో మండిపడుతున్నారు కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో చంద్రబాబు పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేయడం ఎంతో సంచలనంగా మారింది…కర్ణాటక ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ బీజేపి లో వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న బీజేపి జీవీఎల్ నరసింహారావు ద్వారా చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చింది.వివరాలలోకి వెళ్తే…

 Bjp Leader Jvl Strong Warning To Ap Cm Chandrababu-TeluguStop.com

ఒక పక్క కర్ణాటక ఎన్నికలతో తమ సత్తా చాటి చెప్పాలని చూస్తున్న బీజేపికి చంద్రబాబు చెక్ పెట్టే విధంగా వ్యుహరచనలు చేయడంతో ఇక ఉపేక్షించేది లేదని తేల్చిన బీజేపి బాబు కి వార్నింగ్ లు ఇవ్వడం మొదలు పెట్టింది…ఈ దశలోనే జీవీఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేసారు.చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలుపును ఆపలేరు అని అన్నారు…కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని మోడీకి తెలుగు ప్రజలు నీరాజనం పట్టారని దాంతో చంద్రబాబు కి మతిపోయిందని పేర్కొన్నారు.

అయితే ఉద్యోగ సంఘం నాయకుడు అశోక్ బాబుని కూడా తమ పార్టీ.

బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు…అంతేకాదు చంద్రబాబు ఇదే పద్దతిని గనుకా అనుసరిస్తే బీజేపి ని ఇబ్బంది పెట్టాలని చూస్తె భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు.ఏపీ ని ఎంతో ఆదుకున్నాం కానీ ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని కేంద్రం ఏమి చేయలేదు అంటూ ప్రజలని మోసం చేశారని ఆరోపణలు చేశారు.

అంతేకాదు తన రాజకీయ లబ్ధి కోసం అనేక కోట్లు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి దీక్షలు ఉపవాసాలు అంటూ కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సామాన్య ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు.ఏపీ కి వస్తున్నా పెట్టుబడులు కేంద్రం ద్వారా వస్తుంటే చంద్రబాబు వాటిని తమ ఖాతాతో వేసుకుంటున్నారని మండిపడ్డారు.

రాజలసీమలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు రాయలసీమని ఏమి చేశారో బహిరంగంగా ఒక లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

ఎన్నో రకాల ప్రాజెక్ట్ లు కేంద్రం వలన వచ్చాయని అయితే ఏపీలో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని.

ఈ విషయం సాక్షాత్తు జాతీయ నిఘా సంస్థల విచారణలో బయటపడింది అని అన్నారు.తన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం తెలియదు కానీ పక్క రాష్ట్రాల కోసం పరితపిస్తున్నారు అంటూ విమర్శించారు ఇలానే చేస్తే చంద్రబాబు త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube