బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించగలదా అని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు.పేదల గురించి మొదటి నుంచి పోరాడుతుంది కేవలం బీజేపీ పార్టీనేనని తెలిపారు.
కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను బీఆర్ఎస్ దారి మళ్లిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని విమర్శించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలు కాదని స్పష్టం చేశారు.అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







