టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ ఆందోళనలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగా ఇవాళ ఇందిరాపార్కు వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నా చేయనున్నారు.

మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించనున్నారు.మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్న ఈ మహాధర్నాలో పేపర్ లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

అదేవిధంగా కేబినెట్ నుండి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు