2022 సంవత్సరం కళ్యాణ్ రామ్ కు లక్కీ ఇయర్ అనే సంగతి తెలిసిందే.గతేడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన బింబిసార ప్రేక్షకుల అంచనాలను మించి హిట్ గా నిలిచింది.
కొన్నిరోజుల క్రితం ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు ఛానెల్ లో ఈ సినిమా ప్రసారం కాగా ఈ సినిమా అదిరిపోయే రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు బుల్లితెరపై 11.46 రేటింగ్ వచ్చింది.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
కళ్యాణ్ రామ్ కెరీర్ లో బెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో నటిస్తుండగా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు.

కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా మైత్రీ బ్యానర్ లో ఈ సినిమా మరో హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పాటు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలతో పాటు కళ్యాణ్ రామ్ బింబిసార2 సినిమాలో నటిస్తున్నారు.

పాపులారిటీ ఉన్న బ్యానర్లలో నటిస్తూ కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని బింబిసార సక్సెస్ కళ్యాణ్ రామ్ కెరీర్ కు ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బింబిసార సక్సెస్ తో కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.







