కొంత కాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై( AI ) విస్తృత చర్చ కొనసాగుతోంది.ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలన మార్పులు తీసుకొచ్చింది.
తాజాగా దీనిపై బిలియనీర్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్( Bill Gates ) కీలక వ్యాఖ్యలు చేశారు.శాన్ డియాగోలో జరిగిన ఏఎస్‌యూ+జీఎస్‌వీ సమ్మిట్‌లో పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన చాట్‌బాట్‌లు పిల్లలకు అన్నీ నేర్పిస్తాయని అభిప్రాయపడ్డారు.
వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంలో గణనీయమైన ప్రభావం చూపుతాయని అన్నారు.
పిల్లలు 18 నెలల వయసులోనే చదవడం, రాయడం వంటివి ఏఐ చాట్ బాట్ సాయంతో నేర్చుకుంటారని సంచలన కామెంట్స్ చేశారు.ఏఐ చాట్‌బాట్‌తో( AI Chat Bot ) కూడిన సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు అన్నీ నేర్చుకోవడంలో సహాయపడతాయని చెప్పారు.
వీటిని చూసి అంతా ఆశ్చర్యపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.గతంలో కంప్యూటర్‌కు రాత నైపుణ్యాలను బోధించడం కష్టమైన పని అని ఆయన పేర్కొన్నారు.అయితే ఏఐ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయనుందని చెప్పారు.

రాబోయే కొన్నేళ్లలో విద్యార్థులకు ఏఐ గొప్ప ట్యూటర్‌గా ఎదుగుతుందని బిల్ గేట్స్ అంచనా వేశారు.దీంతో పాటు ఎడ్‌టెక్ (ఎడ్యుకేషన్+టెక్నాలజీ)లో ఎన్నో కొత్త టూల్స్ వినియోగిస్తున్నామని, 20 ఏళ్లలో చేయలేని మ్యాథ్స్ ( Maths ) మార్కులను మెరుగుపరచుకోవడంలో ప్రస్తుతం పురోగతి సాధించామని చెప్పారు.గణితంలో మన పనితీరు ఎలా ఉంటుందో ఈ అత్యంత పోటీ వ్యవస్థలో మనం ఎలా సరిపోతామో చాలా వరకు ఏఐ నిర్ణయిస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.

ఏఐ కంపెనీల వర్క్ ఫోర్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.ఆరోగ్యం, విద్యారంగంలో పెద్ద మార్పు తీసుకురాగల సత్తా ఏఐకి ఉందని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థికి వారి అభ్యాస సామర్థ్యం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్‌ను సిద్ధం చేయగలదని, వారి ఆసక్తికి అనుగుణంగా కంటెంట్‌ను రూపొందించగలదని పేర్కొన్నారు.దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు మెరుగ్గా నేర్చుకోగలుగుతారు.