విగ్గుతో బట్టతల కవర్ చేసిన పెళ్లికోడుకు.. నిజం తెలిసి చితకబాదిన బంధువులు..!

పెద్దలు 1000 అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి ( Marriage ) చేయాలి అంటారు అనే సామెత చాలామంది వినే ఉంటారు.

అయితే ఒక వ్యక్తి కేవలం ఒక అబద్ధం ఆడి పెళ్లికి సిద్ధమయ్యాడు.

పెళ్లి మండపంపై అసలు విషయం తెలిసి పెళ్లికి వచ్చిన బంధువుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు.ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండానే చిన్నపిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.

తెల్ల వెంట్రుకలను కవర్ చేయడానికి మార్కెట్లో చాలా రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయి.కానీ బట్టతలను( Bald Head ) కవర్ చేయడం చాలా కష్టం.

అది కూడా కొద్దిసేపు విగ్గుతో ( Wig ) మాత్రమే కవర్ చేయగలం.డబ్బులు ఉంటే హెయిర్స్ ప్లాంటేషన్ తీసుకోవచ్చు.

Advertisement

లేకపోతే విగ్గుతో సరిపెట్టుకోవాల్సిందే.ఇలా ఓ వ్యక్తి బట్టతలను దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.కానీ అడ్డంగా దొరికి చావు దెబ్బలు తిన్న ఘటన బీహార్ లోని( Bihar ) గయాలో జరిగింది.

గయాలోని బజౌరా గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి వివాహం తర్వాత కొన్ని సమస్యల వల్ల భార్యతో విడిపోయి రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.పెళ్లిళ్ల బ్రోకర్ ఒక మంచి సంబంధాన్ని తెచ్చాడు.

అయితే ఈ వ్యక్తి తనకు బట్టతల ఉంది అనే విషయం పెళ్లికూతురుకు చెప్పలేదు.పెళ్లిచూపులు లాంటి కార్యక్రమాలతో పాటు పెళ్లి రోజు వరకు విగ్గు పెట్టుకొని బట్ట తలను కవర్ చేశాడు.

అయితే పెళ్లి మండపంలో అతని హెయిర్ స్టైల్ చూసినా పెళ్లికూతురు బంధువులకు కాస్త అనుమానం కలిగింది.వెంటనే వారు పెళ్లి మండపం పైకి వెళ్లి పూర్తిగా పరీక్షిస్తే అతనికి బట్టతల ఉంది అనే విషయం బయటపడింది.ఈ విషయం పెళ్లికూతురుకు తెలియడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

పెళ్లికూతురు బంధువులు ఆగ్రహంతో పెళ్ళికొడుకును చితకబాదారు.ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మొదటి భార్య అక్కడికి వచ్చింది.

Advertisement

అప్పటికే తన భర్తను కొడుతూ ఉంటే ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తాజా వార్తలు