ప్రకృతిలో ఊహించని ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా పుణ్యమా అని మనం చూడగలుగుతున్నాం.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీసెంట్ వీడియో కూడా ఆ కోవకు కిందకే వస్తుంది.
ఇది ప్రకృతిలో ఒక ఆశ్చర్యకరమైన క్షణాన్ని చూపుతుంది.ఇందులో ఒక పెద్ద ఎలిగేటర్( Big Alligator ) చిన్న ఎలిగేటర్‌ను( Small Alligator ) తినడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.
వన్యప్రాణులను చూడటానికి, అధ్యయనం చేయడానికి ఇష్టపడే వ్యక్తి ఈ అరుదైన సంఘటనను కెమెరాలో బంధించారు.ఆపై ఆన్‌లైన్‌లో షేర్ చేసారు.
ఒక ఎలిగేటర్ మరొకటి తింటున్నదంటూ సింపుల్ వివరణతో ఆ వీడియో పోస్ట్ చేశారు.
వీడియోలో ఎలిగేటర్ దాని సహజ నివాసమైన చిత్తడి నేల ప్రాంతంలో ఉన్నట్లు మనం చూడవచ్చు.
అది ఓ చిన్న ఎలిగేటర్‌ను నోటిలో గట్టిగా పట్టుకోవడం కూడా గమనించవచ్చు.అది చిన్న ఎలిగేటర్‌ను భూమికి అదిమి పట్టి గట్టిగా కదిలిస్తుంది.ఈ రకమైన ప్రవర్తన మనకు షాకింగ్‌గా అనిపించవచ్చు, అయితే ఎలిగేటర్లు( Alligators ) తరచుగా చేసే దాడులలో ఇది కామన్.
కేవలం ఒక్కరోజులోనే దాదాపు 30 లక్షల వ్యూస్‌తో ఈ వీడియో బాగా పాపులర్ అయింది.దీనిపై చాలా మంది ఇంటర్నెట్ యుసార్లు ప్రశ్నలు వేశారు.ఒక ఎలిగేటర్ మరొక ఎలిగేటర్‌ను ఎందుకు తింటుందని అడిగారు.
ఒక వ్యక్తి ఎలిగేటర్‌ను ఇతరులను తినే పాపులర్ సినీ పాత్రతో పోలుస్తూ జోక్ కూడా చేశాడు.మరొక వ్యక్తి ప్రకృతి అనూహ్యమైనదని వ్యాఖ్యానించాడు.
ఎలిగేటర్లు చిన్న జీవుల నుంచి పెద్ద జంతువుల వరకు దాదాపు అన్నిటినీ తింటాయని నిపుణులు చెబుతున్నారు.కొన్నిసార్లు ఇతర ఎలిగేటర్లను కూడా అవి తింటాయని దీని అర్థం.ఈ ప్రవర్తనను నరమాంస భక్ష్యం( Cannibalism ) అని పిలుస్తారు.ఇది మనకు వింతగా అనిపించినప్పటికీ, ఎలిగేటర్లతో సహా అనేక జంతు జాతులలో ఇది కామన్.