మరో మూడు రోజులలో 2020 సంవత్సరం ముగింపు పలికేందుకు సిద్ధం అవుతోంది.ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో ఒక ఆశక్తికరమైన పోటీ జరుగుతుంది.ట్విట్టర్ లో అయితే టాప్ 100.“మోస్ట్ హ్యాండ్సమ్ ఫేసెస్ 2020” అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారుతుంది.సోషల్ మీడియా అభిమానులు వారు అభిమానించే స్టార్ హీరోలని టాప్ ప్లేస్ లో ఉంచేందుకు వారి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.ఈ పోటీల్లో భాగంగా ట్విట్టర్ లో 100 మోస్ట్ హ్యాండ్సమ్ ఫేసెస్ అనే పేరుతో ట్రెండ్ అవుతున్న పోటీలో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
బిగ్ బాస్ విజేత నిలిచిన అనంతరం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అంతేకాకుండా అందరూ కూడా అభిజిత్ స్వయంగా ఈ పోటీలో మొదటి వ్యక్తి అంటూ నామినేట్ చేయడం మొదలుపెట్టారు.
అభిజిత్ అనంతరం హిందీ బిగ్ బాస్ విజేత సిద్ధార్థ శుక్ల, ఇతనితో పాటు అదే సీజన్ లో పోటీగా నిలిచిన మరో కంటెస్టెంట్ ఆసిమ్ రియాజ్.ఇక చివరకు ఈ పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది నెటిజన్స్ .

అభిజీత్ బిగ్ బాస్ షోలో చాలా కూల్ గా తన మైండ్ గేమ్ ఆడుతూ అందరి మనసును దోచే చేసుకున్నాడు.ట్విట్టర్ లో మోస్ట్ చార్మింగ్ ఐకాన్, హ్యాండ్సమ్ పర్సన్ అంటూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అనంతరం అభిజిత్ ప్రేక్షకులకు అభిమానులకు చాలా దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.
ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అభిజిత్ పెద్దగా సినిమాలలో నటించకపోయినా బిగ్ బాస్ షో అనంతరం అభిజిత్ కు ఒక రేంజ్ ఫాలోయింగ్ పెరిగిందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అభిజిత్ కు మంచి అవకాశాలు వస్తుండడం సంతోషకరమైన విషయం.ప్రస్తుతం అభిజిత్ 2 సినిమాలకు ఓకే చెప్పడంతో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లో నటించేందుకు కూడా నటించేందుకు సిద్ధమయ్యాడట.
చూడాలి మరి ఇప్పటినుంచైనా ఈ బిగ్ బాస్ విన్నర్ లైఫ్ అవుతుందో లేదో.?!