రక్తంతో లవ్ లెటర్ రాసింది.. చివరికి హ్యాండ్ ఇచ్చింది.. అఖిల్ బ్రేకప్ స్టోరీ!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకి కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది.

ఇకపోతే తాజాగా హౌస్ లోని కంటెస్టెంట్ లకు తలుపు తట్టిన ప్రేమ ఒక టాస్క్ ని ఇచ్చాడు.టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ వారి మొదటి ప్రేమ గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే కంటెస్టెంట్ అఖిల్ తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.నా చిన్నప్పటి ఫ్రెండ్ అయిన చిన్ను తో ప్రేమలో పడ్డాను అని, ఆమె వేరే వ్యక్తి తో రిలేషన్ లో ఉండి తనకు బ్రేకప్ చెప్పింది అంటూ కాస్త ఎమోషనల్ గా చెప్పాడు అఖిల్.

అఖిల్ తన స్కూల్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకే కాలనీలో ఉండేవారట.ఆమెను అఖిల్ ముద్దుగా నిన్ను అని పిలిచేవారట.

Advertisement

అలా వారిద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాడట.అంతేకాకుండా వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదట.

అలా రెండు ఫ్యామిలీల మధ్య గొడవ జరిగింది దాదాపుగా 2 ఏళ్లపాటు మాట్లాడుకోలేదట.ఒకరోజు ఆమె అఖిల్ ను పక్క వీధిలోకి పిలిచి లెటర్ ఇచ్చిందట.

ఆ లెటర్ ను తన రక్తంతో రాశానని, కావాలంటే చేతికి ఉన్న గాయాలు చూడమని చేతికి ఉన్న గాయాలు చూపించడంతో అఖిల్ ఆమెతో అనుకోకుండా ప్రేమలో పడిపోయాడు.అలా వారిద్దరూ చాలా కాలం పాటు ప్రేమలో మునిగితేలారు.

అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత షూటింగ్ లో ఫుల్ బిజీ బిజీ అయిపోయిన ప్పటికీ క్షణం తీరిక దొరికినా కూడా తనకి మెసేజ్ చేసేవాడట.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

అలా ఒకరోజు అఖిల్ ఫోన్ చేస్తే బిజీ వచ్చిందట, అలా ఎన్ని సార్లు ఆమెకు కాల్ చేసినా బిజీ వస్తూనేఉందట.ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావు అని అఖిల్ ప్రశ్నించడంతో అప్పుడు ఆమె డాడీ తో మాట్లాడుతున్న అని అబద్దం చెప్పిందట.ఇక అదే విషయాన్ని ఆమె సీరియస్ గా తీసుకొని బ్రేకప్ చెప్పేసిందట.

Advertisement

అప్పుడు అఖిల్ బ్రేకప్ వద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా మా ఇంట్లో ఒప్పుకోరు, క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు ఇండస్ట్రీకి చెందిన అబ్బాయి అంటే మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అని ఆమె అఖిల్ కు బ్రేకప్ చెప్పిందట.అయితే అఖిల్ కు బ్రేక్ అప్ చెప్పక ముందే ఆమె కెనడా అబ్బాయితో రిలేషన్ లో ఉందని ఇదే విషయాన్ని ఆమె ఫ్రెండ్ చెప్పడంతో అఖిల్ ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటు డిప్రెషన్ లోకి వెళ్లారట, ఆ తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఆమె మళ్ళీ అఖిల్ కు ఫోన్ చేసి తనను కెనడా అబ్బాయి వదిలేశాడు అని చెప్పిందట.

అలా అప్పటి నుంచి తనకు లవ్ అంటే భయమని ఆ తర్వాత తన జీవితంలో మళ్లీ లవ్ జరగలేదని తెలిపారు అఖిల్.