సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు.అలాంటి వారిలో గంగవ్వ( Gangavva ) కూడా ఒకరు.
తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి అనే కుగ్రామానికి చెందిన గంగవ్వ ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రెటీగా కొనసాగుతున్నారు.గంగవ్వలోని ప్రత్యేకతలు గుర్తించిన స్థానిక యువకులు, వీడియోలు చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
గంగవ్వ వీడియోలకు విశేష ఆదరణ దక్కింది.అలా ఈమె సోషల్ మీడియా స్టార్ అయ్యారు.
అనూహ్యంగా ఈమెకు బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం రావడంతో ఏకంగా సీజన్ 4 కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.పల్లెటూరు వాతావరణం లో పెరిగిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ ఏమాత్రం సెట్ అవ్వలేదు దీంతో ఈమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేకపోవడంతో ఐదవ వారమే హౌస్ నుంచి బయటకు పంపించారు.

ఇక అప్పటివరకు తనకంటూ సొంత ఇల్లు లేదని సొంత ఇంటి కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని గంగవ్వ చెప్పడంతో నాగార్జున( Nagarjuna ) కూడా తన ఇంటి కోసం కొంత ఆర్థిక సహాయం చేశారు.అలా 22 లక్షల ఖర్చు చేసి ఇంటిని కూడా నిర్మించారు.ప్రస్తుతం మూడు ఆవులను కొనుగోలు చేసి ఫామ్ కూడా నడుపుతున్నారు.అయితే బిగ్ బాస్ తర్వాత గంగవ్వకు సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఇలా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే గంగవ్వ ఆస్తులకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

గంగవ్వకు ఇల్లుతో పాటు కొంత పొలం కూడా ఉందని అలాగే కొంత స్థలం కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఈ ఆస్తులు విలువ అంతా కలిపి సుమారు 1.25 కోట్ల రూపాయలు ఉంటుందని గంగవ్వ స్వయంగా వెల్లడించారు.అయితే తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయాన్ని కూడా వెల్లడించారు.
ఇక తాను 50 ఆవులను కొనుగోలు చేసి ఒక ఫార్మ్ నడపడమే తనకాల అంటూ గంగవ్వ చెప్పుకువచ్చారు.