ఏంటి బిగ్ బాస్ అమ్మాయిలపై పగ పట్టావా.. ఈసారి కూడా ఎలిమినేట్ కానున్న లేడీ కంటెస్టెంట్?

బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో 6 వారాలను పూర్తిచేసుకుని ఏడవ వారం కూడా పూర్తికాబోతోంది.

ఈ కార్యక్రమం మొదట్లో 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది.

ఇలా 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 5 వారాలను పూర్తి చేసుకుని ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు.ఇక ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంత ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు.

ఇక ఆరో వారంలో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చినటువంటి నయనీ పావని ఎలిమినేట్ అయ్యారు .

ఇక ఏడవ వారంలో భాగంగా మరొక లేడీ కనిపిస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.బిగ్ బాస్ కార్యక్రమంలో జరగబోయే అన్ని విషయాలు సోషల్ మీడియాలో ముందుగానే వైరల్ అవుతూ ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎలిమినేషన్ కంటెస్టెంట్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన విధంగానే ఎలిమినేషన్ కూడా జరుగుతుంది.

Advertisement

ఇక ఏడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.బిగ్ బాస్ ఏడవ వారంలో కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతుందనే ఒక వార్త వైరల్ గా మారింది.

ఇక ఈవారం ఎలిమినేషన్ లో భాగంగా 7 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.ఇందులో అమర్ దీప్ ,టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, అశ్విని, పూజా మూర్తి, భోలే శవాలి నామినేషన్ లో ఉన్నారు అయితే వీరిలో పూజా మూర్తి ఓటింగ్లో ఆఖరిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వారం పూజా మూర్తి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తుంది.

పూజ మూర్తి ( Pooja murthy ) కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈమె వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చినటువంటి రెండవ వారానికి ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది.

ఇక ఈవారం పూజ ఎలిమినేట్ కాబోతున్నారనే విషయం తెలియడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ అసలు బిగ్ బాస్ ఏంటి అమ్మాయిలపై ఇలా పగ పెట్టుకున్నారు వరుసగా అమ్మాయిలని హౌస్ నుంచి బయటకు పంపించేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు