ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరు అమర్ దీప్.( Amardeep ) వెబ్ సిరీస్ మరియు సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న అమర్ దీప్, బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి అడుగుపెట్టి కోట్లాది మంది తెలుగు ప్రజలకు అత్యంత చేరువ అయ్యాడు.
ప్రతీ కంటెస్టెంట్ జనాలను మెప్పించడానికి ఎదో ఒక మాస్క్ వేసుకొని నటిస్తూ ఉంటారు.కానీ అమర్ దీప్ తన పై 82 కెమెరాలు ఫోకస్ చేస్తున్నాయి అనే విషయాన్నే పక్కన పెట్టేసాడు.
ప్రతీ ఎమోషన్ ని ఫిల్టర్ లేకుండా జనాల ముందు పెట్టాడు.అతనికి కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆపుకోలేదు.
మిగతా కంటెస్టెంట్స్ లాగ తెలిసి తెలియకుండా ఫౌల్ గేమ్స్ కూడా ఆడలేదు.అంతా ఓపెన్ బుక్ లాగా సాగిపోయింది అమర్ దీప్ బిగ్ బాస్ జర్నీ.కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అని అనిపించిన అమర్ దీప్ కి 14 వ వారం పల్లవి ప్రశాంత్ తో( Pallavi Prashanth ) జరిగిన ఒక గొడవ మైనస్ అయ్యింది అనే చెప్పాలి.ఈ గొడవ లో అమర్ దీప్ ప్రశాంత్ ని నెట్టుకుంటూ తీసుకొని వెళ్లడం ప్రశాంత్ పై జనాల్లో సానుభూతి, అలాగే అమర్ దీప్ పై కోపం రప్పించేలా చేసాయి.
దీంతో కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అనుకున్న అమర్ దీప్ చివరికి టాప్ 2 కంటెస్టెంట్ గా, రన్నర్ గా మిగిలాడు.

ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్ బయటకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను మనమంతా చూసాము.అవన్నీ పక్కన పెడితే అమర్ ఆరోగ్యం( Amardeep Health ) ప్రస్తుతం చాలా అంటే చాలా వీక్ గా ఉందని అతని స్నేహితుడు నరేష్ లొల్ల( Naresh Lolla ) చెప్పుకొచ్చాడు.అమర్ కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
ముఖ్యంగా కండరాలు పెరగకపోవడం , అందువల్ల అమర్ దీప్ కి ఫైట్స్ రావడం వంటివి బిగ్ బాస్ హౌస్ లో చాలా సార్లు జరిగాయట.కానీ వీటిని అడ్డు పెట్టుకొని సానుభూతి పొందాలని హౌస్ లో అమర్ దీప్ ఒక్కసారి కూడా ప్రయత్నం చెయ్యలేదు.

ప్రతీ టాస్కు ప్రారంభం అయ్యే ముందు అమర్ దీప్ సెలైన్లు ఎక్కించుకొని దిగేవాడట.దీని గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు.అయితే ఇన్ని రోజుల బిగ్ బాస్ ప్రయాణం లో అతి తీవ్రంగా అలిసిపోయిన అమర్ దీప్ నేడు మెడికల్ టెస్టులు( Medical Tests ) చేయించుకోబోతున్నాడట.ప్రస్తుతం ఆయనకీ విశ్రాంతి పూర్తిగా అవసరం ఉందని డాక్టర్లు చెప్పడం తో ఇంటర్వ్యూస్ కి కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అతని స్నేహితుడు నరేష్ చెప్పుకొచ్చాడు.