'రావణాసుర' నుండి దీపావళి అప్డేట్.. అందుకు ముహూర్తం ఫిక్స్!

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.

ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

ఇక శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఈ సినిమా తీవ్ర నిరాశ పరిచింది.

అట్టర్ ప్లాప్ అవ్వడంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఈయన సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.ప్రెజెంట్ ఈయన మరికొన్ని సినిమాలను ప్రకటించాడు.

ఇక ఈయన ప్రకటించిన అరడజను సినిమాల్లో రావణాసుర ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు నటించనున్నారు.అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కు రచయిత శ్రీకాంత్ విస్సా కథను అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరి ఈ ప్రాజెక్ట్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాపై దివాళీ కానుకగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.ఈ దీపావళి కానుకగా రేపు ఒక మాసివ్ అప్డేట్ ను ఇవ్వబోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

రేపు ఉదయం 10 గంటల 8 నిముషాలకు ఆ అప్డేట్ రిలీజ్ చేయనున్నారట.మరి ఏ అప్డేట్ ఇవ్వబోతున్నారో చూడాలి.ఇక ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తుండగా.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.ఇక దీనితో పాటు రవితేజ ధమాకా సినిమా కూడా చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్నాడు.

తాజా వార్తలు