పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బిగ్ బాస్ విన్నర్ కౌశల్

బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్న అన్తుడు కౌశల్.

బిగ్ బాస్ షోలో తన వ్యక్తిత్వంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కౌశల్ ఈ షో ద్వారా మంచి మైలేజ్ సొంతం చేసుకొని కౌశల్ కి మంచి గుర్తింపు వచ్చింది.

ఆ పాపులారిటీతో తెలుగులో బిజీ స్టార్ గా మారిపోతాడని, హీరోగా అవకాశాలు వస్తాయని చాలా మంది భావించారు.అయితే కౌశల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఏవో కారణాల వలన ఆగిపోయాయి.కౌశల్ కారణంగానే ఆ సినిమాలు ఆగిపోయాయని టాక్ వినిపించింది.

కథలు వేలుపెట్టి ఇష్టానుసారంగా మార్చమని చెప్పడంతో వచ్చిన అవకాశాలు కూడా దూరం అయ్యాయని చర్చ నడిచింది.తాజాగా కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు తెలుస్తోంది.

Advertisement

ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది.లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారని సమాచారం.ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు