ఇకపై అన్నీ చూపిస్తానంటోన్న ముదురు భామ

టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ భూమికా చావ్లా, ప్రస్తుతం తన రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.

ఇటీవల వరుసగా సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

కాగా గతంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఎక్కడా హద్దులు దాటకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే పాత్రల్లో అలరించింది.అయితే రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన తరువాత తన పాత గుర్తింపును తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోందట.

Bhumika Chawla, Ruler, Telugu Heroine, Bold Roles, Tollywood News-ఇకపై �

ప్రాధాన్యత లేని పాత్రలే ఆమెకు ఎక్కవగా వస్తుండటంతో, ప్రేక్షకులు ఆమెను పట్టించుకునే అవకాశం లేదని భావిస్తోందట.దీంతో తన నెక్ట్స్ చిత్రాల్లో బోల్డ్ సీన్స్‌కు కూడా రెడీ అంటోంది ఈ బ్యూటీ.

హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్‌తో పాటు లిప్‌లాక్ సీన్స్‌కు కూడా భూమిక రెడీ అంటోందట.ప్రస్తుతం హాట్ మరియు బోల్డ్ సీన్స్ చేస్తే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించింది.

Advertisement

ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ తరువాత పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను ఓకే చేసే పనిలో పడిందట ఈ బ్యూటీ.బాలీవుడ్‌లో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇలాంటి పాత్రలే చేస్తున్నారని, వారికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రలు లభిస్తున్నాయని భూమిక అంటోంది.

ఈ క్రమంలో బోల్డ్ పాత్రలకే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇవ్వనుందట భూమిక.మరి తెలుగు ఆడియెన్స్ ఆమెను ఎలాంటి బోల్డ్ సీన్స్‌లో ఇష్టపడతారో చూడాలి.

అయితే ఈ బ్యూటీ చేయబోయే బోల్డ్ పాత్రలు ఆమెకు ఇప్పటికైనా తన పాత గుర్తింపును తీసుకువస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు