రాఖీ పండుగ పేరు చెబితేనే భయపడే గ్రామం ఎక్కడుందో తెలుసా?

రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలు.అక్కా, చెల్లెల్లు ఎక్కడున్నా అన్నా, తమ్ముళ్ల చెంతకు చేరుకుంటారు.

సోదరుల చేతికి రాఖీ కట్టి చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు.అలాగే సదరులు కూడా రాఖీ కట్టిన అమ్మాయిలను జీవితాంతం కాపాడుకుంటామని వాగ్ధానం చేస్తుంటారు.

అయితే భారతీయులంతా ఈ పండుగ కోసం కనీసం నెల రోజుల ముందు నుంచే వేచి చూస్తుంటారు.దేశమంతటా జరుపకుునే ఈ పండుగను ఒక్క చోట మాత్రం జరుపుకోరు.

కనీసం ఆ పండుగ పేరు పలకడానికి కూడా భయపడిపోతుంటారు.అంతే కాదండోయ్ అస్సలే రాఖీ కట్టించుకోరు.

Advertisement

కట్టడానికి కూడా ఆ గ్రామ ప్రజలు ముందుకు రారు.అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లా భికింపూర్ జగత్ పూర్వ గ్రామంలో 1955లో ఒక అమ్మాయి తన సోదరుడికి రాఖీ కట్టిందట.అయితే అదే రోజు అతడిని ఎవరో హత్య చేశారు.

దాని తర్వాత కూడా రెండు మూడేళ్ల పాటు ఇలాంటి ఘటనలే జరగడంతో గ్రామస్థులు ఈ పండుగను చేస్కోవడమే మానేశారు.పండుగ రోజు గ్రామంలోని ఎవరికైనా బిడ్డ పుడితే రాఖీ పౌర్ణమి చేస్కుందామని చూస్తున్నారు.

కానీ మూడు శతాబ్దాలకు పైగా ఆరోజు ఎవరూ పుట్టలేదట.రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకునేందుకు గ్రామస్థులంతా వేచి చూస్తున్నారట.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

దాదాపు గ్రామంలో 200 మంది చిన్న పిల్లలు ఉన్నారని.పండుగ రోజు జరిగే విచిత్రమైన సంఘటనలు చూసి వారంతా భయపడిపోతారని తెలిపారు.

Advertisement

తాతల కాలం నుంచి ఇందుకు సంబంధించిన కథలను రకరకాలుగా చెప్పుకుంటారట.