వరంగల్ జిల్లా సంగెం మండలంలో వింత సంఘటన జరిగింది.తన భార్య బతికి ఉండగానే చనిపోయిందంటూ ఆమె దశదిన కర్మ చేయబోతున్నట్లుగా ఆహ్వాన పత్రికలు కొట్టించి బందువులకు పంచి పెట్టాడు.
ఆ కార్డులను తన తన భార్యకు మరియు ఆమె తరపు బంధువులకు కూడా ఇవ్వడంతో వివాదం పోలీసుల వరకు వెళ్లింది.భార్య సుమతిపై భర్త చందర్రావు చేసిన ఈ పని ప్రస్తుతం వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది.పోలీసులు మరియు బాధితులు చెప్పిన విషయాలు, వివరాలను బట్టి పూర్తి విషయం ఏంటీ అంటే…

సంగెం మండలంకు చెందిన చందర్ రావు మరియు సుమతిలు అయిదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరిద్దరు కొంత కాలం వరకు బాగానే ఉన్నారు.అయితే చందర్రావుకు తాగుడు అలవాటు బాగా ఉండటంతో సుమతి పదే పదే గొడవ పెట్టుకుంటూ ఉండేది.ఇటీవల తన కొడుకు స్కూల్కు హాలీడేస్ వచ్చిన నేపథ్యంలో సుమంత తల్లిగారింటికి వెళ్లింది.
ఆమె ఎంతగా రాకపోవడంతో చందర్రావుకు ఆగ్రహం వచ్చింది.కోపంతో అత్తవారింటికి ఫోన్ చేసి సుమతిని పంపించాల్సిందిగా అడిగాడు.
అందుకు అత్తింటివారు నో చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.
తన వద్దకు రాని భార్య చనిపోయినట్లే అంటూ ఆమె దశదిన కర్మ చేసేందుకు సిద్దం అయ్యాడు.
దాదాపు అయిదు వందల కార్డులు కొట్టించి, ఊరు అంతా పిలవడంతో పాటు, తన భార్యకు మరియు భార్య తల్లిదండ్రులకు కూడా కార్డు ఇవ్వడం జరిగింది.ఆ కార్డు చూసి నివ్వెర పోయిన సుమతి మరియు ఆమె తరపు బంధువులు చందర్రావుపై దాడికి ప్రయత్నించారు.
ఆయన తప్పించుకుని తన ఊరుకు వచ్చేశాడు.
ఆ తర్వాత చందర్రావుపై సంగెం పోలీస్ స్టేషన్లో సుమతి ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు చందర్రావు మరియు సుమతిలని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.భార్యతో కలిసి జీవించేందుకు చందర్రావు ఓకే చెప్పగా, సుమతి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో భర్త వద్దకు వెళ్లను అంటూ భీష్మించుకు కూర్చుంది.
ఇద్దరు విడాకులు తీసుకుంటారా లేదంటే మరి కొంత కాలం వెయిట్ చేసి ఆ తర్వాత కలిసి పోతారా అనేది చూడాలి.
.