గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ప్రస్తావన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అకస్మాత్తుగా వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై మొదలైన వివాదం వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది.
గతంలో చంద్రబాబును ఎన్టీఆర్ ఏవిధంగా ద్వేషించేవారనే విషయాలతో పాటు , చంద్రబాబు వర్గం ఎన్టీఆర్ ను ఏ విధంగా అవమానాలకు గురిచేసిందనే విషయం వరకు అన్నిటిని వైసిపి, ఆ పార్టీ సోషల్ మీడియా బయటపెడుతూ నానా హడావుడి చేస్తోంది.గత కొద్ది రోజులుగా ఇదే అంశంపై ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
అసలు ఎన్టీఆర్ పేరును మార్చి రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్, వైఎస్సార్ ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని పక్కన పెడితే , ఎన్టీఆర్ ను అమితంగా ఆరాధించే సామాన్య జనాలు కూడా వైసిపి ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు.
అయితే ఈ వ్యవహారంలో తాము విమర్శలు ఎదుర్కోవడం టిడిపికి కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్న వైసిపి అధిష్టానం ఎన్టీఆర్ అభిమానుల మద్దతు కూడగట్టడంతో పాటు, రాజకీయంగా టిడిపిని జబ్బు కొట్టేందుకు ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తే అది వైసిపి కి ఎంతో క్రెడిట్ తీసుకురావడంతో పాటు , రాజకీయంగా చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు.గతంలోనే ఎన్టీఆర్ కు భారతరత్న రావాల్సి ఉన్నా.
చంద్రబాబు అడ్డుకోవడంతోనే అది ఆగిపోయిందనే విమర్శలు ఉండడంతో, ఇప్పుడు వైసీపీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారంపై బీజేపీ సైతం విమర్శలు చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించే ప్రక్రియలో బిజెపిని భాగస్వామ్యం చేయడం ద్వారా , ఆ పార్టీని ఇరుకును పెట్టవచ్చనే లెక్కల్లో వైసిపి ఉందట.ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర బిజెపి అభ్యర్థులు అంగీకారం తెలిపితే అది వైసీపీకి క్రెడిట్ తీసుకొస్తుందని, ఒకవేళ ఆ ప్రతిపాదనను బిజెపి పెద్దలు తిరస్కరిస్తే,.వైసిపి గట్టిగా కృషి చేసినా బిజెపి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వకుండా అడ్డుకుంది అనే విమర్శలను ఆ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అనే వ్యూహంలో వైసీపీ ఉంది.
ఒకవేళ ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చినా, ఆయన భార్య హోదాలో వైసిపి నాయకురాలుగా ఉన్న నందమూరి లక్ష్మీపార్వతి దానిని స్వీకరించాల్సి ఉంటుంది.ఏ విధంగా చూసినా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన వైసిపి పెట్టినా దానికి కేంద్రం సానుకూలంగా స్పందించినా, స్పందించకపోయినా ఏ విధంగా చూసినా అది వైసీపీకి క్రెడిట్ తీసుకువస్తుంది అనడంలో సందేహమే లేదు.
.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy