రెండుసార్లు భానుప్రియ పెళ్ళికి అడ్డుపడిన ఆమె తల్లి... కారణం ఏంటో తెలుసా ?

సితార సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భానుప్రియ అచ్చ తెలుగు అమ్మాయి పాత్రలకు చక్కగా నప్పుతుంది.

చారడేసి కళ్ళతో, వాలు జడతో, చెక్కిన శిల్పంలా ఉండే భానుప్రియ వంశీ సినిమాల ద్వారా స్టార్డం సంపాదించుకుంది.

సితార, అన్వేషణ వంటి సినిమాల విజయాలతో వెనుతిరిగి చూసుకోనంత బిజీ హీరోయిన్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150 కి పైగా సినిమాల్లో నటించింది.

భాను ప్రియా సినిమా జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే అయినా, ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఆటుపోట్లు ఉన్నాయి. ఆదర్శ కౌశల్ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుప్రియ అనతికాలంలో అతనిని కూడా కోల్పోయింది.భానుప్రియ కి ప్రస్తుతం ఓ కుమార్తె అభినయ కూడా ఉంది.

ఇక ఆమె జీవితంలో రెండు సార్లు ప్రేమలో పడగా అందుకు ఆమె తల్లి ఒప్పుకోకపోవడంతో భాను ప్రియా జీవితం ఒడిదుడుకులకు గురైంది.

Advertisement

మొదటగా దర్శకుడు వంశీతో ప్రేమలో పడిన భానుప్రియ అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది.టాలీవుడ్ లోనే మంచి క్రేజ్ కాదు ఉన్న ఈ కాంబినేషన్ కి అనేక మంది అభిమానులు ఉన్నారు.అయితే భానుప్రియ తో వంశీ పెళ్లికి ఓవైపు భానుప్రియ తల్లి, మరోవైపు వంశీ భార్య నిరాకరించడంతో వీరి ప్రేమకు పులుస్టాప్ పడింది.

తర్వాత నాట్యకారిణి సుమతీ కౌశల్ కుమారుడైన ఆదర్శ్ కౌశల్ తో ప్రేమలో పడిన భానుప్రియ తల్లి పర్మిషన్ కోసం ఎదురుచూసిన అందుకు ఆమె నిరాకరించడంతో ఇక తన జీవితం ఏమైపోతుందో అనే భయంతో అమెరికా వెళ్ళిపోయి, అక్కడే కుటుంబ సభ్యులు లేకపోయినా కూడా వివాహం చేసుకొని కొన్నాళ్లకు కూతురు అభినయ తో ఇండియా తిరిగి వచ్చింది.అలా రెండుసార్లు భానుప్రియ తల్లి ఆమె పెళ్లికి అడ్డుపడింది.

అందుకు గల కారణం భానుప్రియ కెరియర్ లో మాత్రమే బిజీగా ఉండాలని ఆమె తల్లి కోరుకోవడమే.కానీ తల్లిని మాట విని మరోసారి ప్రేమలో విఫలం కావడం ఇష్టం లేని భానుప్రియ తల్లి అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకుంది.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు