దసరా సీజన్ లో బరిలోకి దిగిన సినిమాల్లో భగవంత్ కేసరి ఒకటి.వరుస సూపర్ హిట్స్ తర్వాత మళ్ళీ బరిలోకి దిగి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి’‘.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

అనుకున్నట్టుగానే అక్టోబర్ 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఇక ఈ సినిమా మొదటి వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.రెండవ వారం వీక్ డేస్ కావడంతో కలెక్షన్స్ భారీగా పడిపోయినట్టు తెలుస్తుంది.

6వ రోజు నుండి కాస్త నెమ్మదించిన ఈ సినిమా వసూళ్లు నిలకడగా వస్తూనే ఉన్నాయి.బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యింది.మరి నిన్న 12వ రోజు కలెక్షన్స్ మరీ తగ్గినట్టు తెలుస్తుంది.12వ రోజు 1.05 కోట్ల గ్రాస్, 85 లక్షల షేర్ రాబట్టినట్టు టాక్.12 రోజుల్లో 64 కోట్ల షేర్ వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది.ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 5 కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది.
రి ఈ వీకెండ్ లోపు ఈ మూవీ లాభాల్లోకి వచ్చేలా కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal) నటించగా కూతురు రోల్ లో శ్రీలీల( Sreeleela ) విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Arjun Rampal ) నటించారు.
ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.







