సంపదకు కోలమానం డబ్బు కాదని చెబుతున్న భగవద్గీత సూక్తులు.. ఎందుకో తెలుసా..?

కాలం ఎలా మారుతుందో, ఎప్పుడు మారుతుందో ఎవరు అర్థం చేసుకోలేరు అని భగవద్గీతలో( Bhagavadgita ) శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు.రాత్రి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు.

కానీ రాముడు( Sri Rama ) ఉదయాన్నే వనవాసం చేయవలసి వచ్చింది.అందుకోసం మన పని మనం చేస్తూనే ఉండాలి అని గీత చెబుతూ ఉంది.

సంపదకు కేవలం డబ్బు మాత్రమే కొలమానం కాదు.మంచి ప్రవర్తన మంచి పనులు చేసే వ్యక్తి నిజంగా ధనవంతుడు అవుతాడు.

ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటికీ పేదవాడి గానే ఉంటాడు.నిన్ను నువ్వు నమ్ముకుంటే బలవంతుడవు అవుతావు అని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు.

Advertisement

మీరు ఇతరులపై ఆధారపడితే అది మిమ్మల్ని శక్తివంతుల్ని అస్సలు చేయదు.జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఆత్మవిశ్వాసం( Self Confidence ) ఉండాలి.ముందు నిన్ను నువ్వు నమ్మాలి అని శ్రీకృష్ణుడు( Sri Krishna ) చెబుతాడు.

గతం మనకు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది.ఈరోజు మనకు జీవితాన్ని గడపడానికి రెండో అవకాశాన్ని ఇస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు.

అందుకే ప్రతిరోజు గతంలో జీవించకుండా ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి.అతిగా ఆలోచించకుండా మనస్ఫూర్తిగా జీవించడం నేర్చుకోవాలి.

మనిషి ఒంటరిగా పుడతాడని మరణాన్ని( Death ) ఒంటరిగా ఎదుర్కొంటాడని గీత చెబుతోంది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
ఎంత తీవ్ర‌మైన హెయిర్ ఫాల్‌కి అయినా అడ్డుక‌ట్ట వేసే సూప‌ర్ రెమెడీ ఇదే!

ప్రతి వ్యక్తి తన మంచి మరియు చెడు కర్మల ఫలాలను పొందుతాడు.కాబట్టి గుంపు ప్రవర్తన ను అనుసరించకుండా మీరు కర్మ పై దృష్టి పెట్టండి.ఒంటరిగా మార్గంలో నడవడానికి భయపడకండి.

Advertisement

మితిమీరిన సుఖం, అతి ప్రేమ,( Excess Love ) మనిషిని కృంగా తీస్తుందని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు.కాబట్టి మితిమీరిన సౌఖ్యం, ఆప్యాయతలకు దూరంగా ఉండాలి.

లేకపోతే తమ జీవితాన్ని తమే పాడు చేసుకోవడమే కాకుండా ఇతరులకు దుఃఖాన్ని మిగిల్చిన వారు అవుతారు.భగవద్గీతలో 18 అధ్యాయాలు, 720 శ్లోకాలు ఉన్నాయి.

ఇందులోని సూక్తులు మనుషులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయి.ఈ అంశాలు జీవితంలో అనుసరించినప్పుడు శాంతి, ప్రశాంతత, ఆత్మీయతలతో కూడిన అందమైన జీవితాన్ని గడపవచ్చు.

తాజా వార్తలు