వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారం ఏ ప్రదేశంలో ఉండకూడదో తెలుసా?

సాధారణంగా హిందువులు ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం మీద ఎన్నో నమ్మకాలను పెట్టుకుంటారు.

వాస్తు శాస్త్రం పై ఉన్న నమ్మకంతో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక వస్తువును వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరిస్తారు.ఈ క్రమంలోనే మన ఇంట్లో గడియారం తప్పకుండా ఉంటుంది.

అయితే చాలామంది గడియారం వారు టైం చూసుకోవడానికి అనుకూలంగా పెట్టుకుంటారే తప్ప.వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది గడియారం పెట్టుకోరు.

కానీ గడియారం తప్పనిసరిగా కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.మరి గడియారం ఇంట్లో ఏ ప్రదేశంలో ఉండాలి.

Advertisement
Vastu Tips To Place Your Wall Clocks In The Right Direction At The Right Place,

ఏ ప్రదేశంలో ఉండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో గడియారం సరైన దిశలో వేలాడ తీసినప్పుడే మన ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

అలాకాకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ వేలాడదీయడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడు నెగెటివ్ వాతావరణం ఏర్పడి ఇంట్లో కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.కనుక గడియారం ఎల్లప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉండాలి.

Vastu Tips To Place Your Wall Clocks In The Right Direction At The Right Place,

వాస్తు శాస్త్రం ప్రకారం గోడగడియారం ఎల్లప్పుడు మన ఇంట్లో తూర్పు పడమర లేదా ఉత్తర దిశవైపు మాత్రమే ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా గోడగడియారం వేలాడదీయడం వల్ల మనం పనులు చేస్తున్న సమయం చూడటానికి ఎంతో సౌకర్యంగా ఉండటమే కాకుండా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.గోడగడియారం ఉత్తరం వైపు వేలాడదీయడం వల్ల సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.

అదేవిధంగా ఉత్తరం దిశ ధనవంతుడైన కుబేరుడుకి, వినాయకుడి దిశగా పరిగణిస్తారు కనుక ఉత్తర దిశ వైపు గడియారం ఉండడం ఎంతో శుభప్రదం.

Vastu Tips To Place Your Wall Clocks In The Right Direction At The Right Place,
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తూర్పువైపు చెక్క గడియారం వేలాడదీయటం ఇంటికి వృద్ధిని ఇవ్వడమే కాకుండా మీ పనుల్లో నాణ్యతను పెంచుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం గోడగడియారం ఎప్పుడూ కూడా దక్షిణ దిశ ముఖం గోడ వైపు ఉండకూడదు.అదేవిధంగా ఇంటికి నైరుతి ఆగ్నేయ దిశలో కూడా ఉండకూడదు.

Advertisement

అదేవిధంగా గడియారం ఎల్లప్పుడూ కూడా తలుపు పైభాగంలో వేలాడ తీయకూడదు.గోడ గడియారం ఎప్పుడు కూడా ఇంటి బయట వేలాడదీయకూడదు అలాగే ఇంట్లో చెడిపోయినా, పనిచేయని గోడ గడియారాలు ఉంటే వెంటనే వాటిని తీసి బయట పెట్టాలి, కానీ ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు