Bad Cholesterol Juice : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఇలాంటి జ్యూస్ లు కచ్చితంగా తాగాల్సిందే..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని వైద్యశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఉండడం వల్ల ఆ వ్యక్తికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

ప్రస్తుత సమాజంలోని ఆహారపు అలవాట్లు ఉన్న ఇలా జరుగుతుందని కూడా కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు.చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అని కూడా అంటారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది.అయితే కొన్ని డైటరీ సప్లిమెంట్ ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా ప్రతిరోజు ఒక గ్లాస్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో చాలా రోజులుగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది.ఎలాంటి పండ్ల జ్యూసులు తాగితే ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Juices For Bad Cholesterol Control,bad Cholesterol Citrus Juice,orange,che
Advertisement
Best Juices For Bad Cholesterol Control,Bad Cholesterol Citrus Juice,Orange,Che

సిట్రస్ ఫ్రూట్ అయిన ఆరెంజ్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ప్రతిరోజు ఆరెంజ్ ప్రాసాన్ని తాగి వారిలో 18 శాతం చెడు కొలెస్ట్రాల్ తగ్గినట్లు ఒక పరిశోధనలో తేలింది.అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ నారింజ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నారింజ పండ్లు తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Best Juices For Bad Cholesterol Control,bad Cholesterol Citrus Juice,orange,che

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చెర్రీ జ్యూస్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా చెర్రీ జ్యూస్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని ఎన్నో అధ్యయనాలు తెలిసింది.క్రమం తప్పకుండా చెర్రీ జ్యూస్‌ను తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.

నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా పడుకునే ముందు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంది.మామిడి గింజలతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

దీంతో పాటు కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి.

Advertisement

తాజా వార్తలు