గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే నివారణ కోసం ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!

ఈ మధ్యకాలంలో చాలామంది తింటున్న ఆహారం వలన గ్యాస్ సమస్యలతో( Gastric Problem ) చాలామంది బాధపడుతున్నారు.

ఇక గ్యాస్ సమస్య ఉన్నప్పుడు గుండెల్లో నొప్పి, అసౌకర్యం కలుగుతూ ఉంటుంది.

మరి ముఖ్యంగా భోజనం తర్వాత కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.గ్యాస్, అపానవాయువు అనేది జీర్ణ వ్యవస్థలు సంభవించే సాధారణ ప్రక్రియ.

ఇది ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది.అయితే శరీరం సరిగా పనిచేయడం లేదన్న దానికి ఇది సంకేతం.

అందుకే కొన్ని చిట్కాల ద్వారా దీని నుండి ఉపశమనం పొందవచ్చు.గ్యాస్ అలాగే ఉబ్బరం యొక్క లక్షణాలను తగ్గించడానికి సహాయపడే అనేక గృహ నివారణలు ఉన్నాయి.

Advertisement
Best Home Remedies For Gastric Problems,Gastric Problems,Digestive Problems,Appl

వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Best Home Remedies For Gastric Problems,gastric Problems,digestive Problems,appl

పప్పిర్మెంట్ టీ తాగడం వలన గ్యాస్, కడుపుబ్బరం లాంటి సమస్యలకు నివారణ దొరుకుతుంది.ఇందులో మెంతోల్ ఉంటుంది.ఇది జీర్ణాశయంలోని కండరాలను సడలించడానికి ఉపయోగపడుతుంది.

అలాగే ఇది గ్యాస్ సమస్య నుండి బయట పడేందుకు సహాయపడుతుంది.భోజనం చేసిన తర్వాత ఒక కప్పు పెప్పర్మేంట్ టీ తాగడం వలన గ్యాస్ కారణంగా వచ్చే ఉబ్బరం, కడుపులో అసౌకర్యం తగ్గిపోతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) జీర్ణ క్రియ ప్రయోజనాలకు ప్రసిద్ధి.ఆహారాన్ని విచ్చినం చేయడానికి ఇది సహాయపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ మొత్తాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.అయితే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో కలుపుకొని భోజనానికి ముందు తాగడం వలన ఉబ్బరం, అసౌకర్యం లాంటివి తగ్గిపోతాయి.

Best Home Remedies For Gastric Problems,gastric Problems,digestive Problems,appl
Advertisement

ఫెన్నెల్ గింజలు( Fennel Seeds ) సహజమైన యాంటిస్పాస్పొడిక్.ఇవి జీర్ణాశయంలోని కండరాలను సడలించడంలో సహాయపడతాయి.దీంతో గ్యాస్ బయటకు వెళ్లిపోయేలా వీలు కల్పిస్తాయి.

ఒక కప్పు వెచ్చని ఫెన్నెల్ టీ తాగడం వలన గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు.అల్లంలో సహజ సిద్దమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

ఇది జీర్ణాశయంలోని కండరాలను సడలించడంలో సహాయపడతాయి.అలాగే గ్యాస్ సమస్యలను కూడా తొలగిస్తాయి.

ఒక కప్పు అల్లం టీ తాగడం వలన కడుపులో నొప్పి, ఉబ్బరం లాంటివి తగ్గిపోతాయి.అలాగే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

తాజా వార్తలు