ప్ర‌తి మ‌హిళా డైట్‌లో చేర్చుకోవాల్సిన‌ సూప‌ర్ ఫుడ్స్ ఇవే!

సాధార‌ణంగా పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌లు త‌మ జీవితంలో ఎన్నో స‌వాళ్ల‌ను, స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.అందుకే వారు ఎల్ల‌ప్పుడూ స్ట్రోంగ్‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం.

అలా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌హిళ‌లు వారంలో రెండు సార్లు అయినా ఖ‌చ్చితంగా ఆకు కూర‌లు తీసుకోవాలి.ముఖ్యంగా పాల కూర, బ‌చ్చ‌లి కూర, బ్రోకలీ, కాలీఫ్లవర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

వీటిలో ఐరన్, మాంగనీస్, కాల్షియం వంటి ముఖ్య‌మైన ఖ‌నిజాల‌తో పాటు విట‌మిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి.ఇవి మ‌హిళల ఆరోగ్యానికి ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయి.

Advertisement
Best Foods For Women's Health Best Foods, Women's Health, Strong Women, Healthy

అలాగే న‌ట్స్ కూడా రెగ్యుల‌ర్‌గా మ‌హిళ‌లు తీసుకోవాలి.బాదం ప‌ప్పు, పిస్తా ప‌ప్పు, వాల్ న‌ట్స్ వంటివి ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

ఎందుకంటే, మ‌హిళ‌ల్లో వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంతో న‌ట్స్‌లో ఉండే పోష‌కాలు ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

Best Foods For Womens Health Best Foods, Womens Health, Strong Women, Healthy

నువ్వులు మ‌హిళ ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.నువ్వుల‌ను బెల్లంతో క‌లిపి త‌ర‌చూ తీసుకుంటే.అడ‌వారిలో ఎక్కువ‌గా క‌నిపించే ర‌క్త హీన‌త స‌మ‌స్య దూరం అవుతుంది.

నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.మ‌రియు శ‌రీరానికి ఎంతో శ‌క్తి కూడా ల‌భిస్తుంది.

Best Foods For Womens Health Best Foods, Womens Health, Strong Women, Healthy
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది‌.ముఖ్యంగా మ‌హిళ‌లు త‌ర‌చూ క్యారెట్‌ను తీసుకుంటే ఆరోగ్య ప‌రంగానూ మ‌రియు సౌంద‌ర్య ప‌రంగానూ ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు.పైగా క్యారెట్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు.

Advertisement

అలాగే ప్ర‌తి రోజు గుడ్డు మ‌రియు పాలు తీసుకోవాలి.ఇక పండ్ల విష‌యానికి వ‌స్తే మ‌హిళ‌లు ఆపిల్, అవోకాడో, బొప్పాయి, దానిమ్మ‌, క‌మ‌లా, బెర్రీస్ వంటివి ఖ‌చ్చితంగా త‌ర‌చూ తీసుకోవాలి.

శ‌రీరానికి కావాల్సిన అనేక పోష‌కాలు ఈ పండ్ల ద్వారా పొందొచ్చు.

తాజా వార్తలు