ఏ ఆహారం తింటే త్వరగా బరువు తగ్గుతారు?

ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ఎక్కువమంది ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు.తద్వారా శరీర బరువు అమాంతం పెరిగిపోతున్నారు.

శరీర బరువు అధికంగా పెరగడం ద్వారా అనేక సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.అయితే శరీర బరువును తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

కొందరు డైట్ ఫాలో అవుతుంటారు.మరికొందరు బరువు తగ్గడానికి అతి తక్కువ పరిమాణంలో రైస్ తీసుకోవడం జరుగుతుంది.

అయితే త్వరగా బరువు తగ్గాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం బరువు తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా భారత దేశంలో ప్రధాన ఆహార వనరులతో బియ్యం లేదా గోధుమలను వాడుతూ ఉంటారు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా కూడా బియ్యం ప్రధాన ఆహార వనరుగా ఉపయోగిస్తున్నారు.బియ్యం తో చేసిన అన్నం ఎక్కువగా తినడం ద్వారా అందులో అధిక శాతం కేలరీలు కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల శరీర బరువు పెరగడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గడానికి, లేదా మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా ఆహారంలో కేలరీల పై దృష్టి పెడతారు.అయితే బియ్యం, గోధుమలు దాదాపుగా రెండు ఒకే పరిమాణంలో కేలరీలను అందిస్తాయి.

కాకపోతే బియ్యం అధిక మొత్తంలో పాలిష్ చేయడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు, విటమిన్స్, ఫైబర్ లను కోల్పోయి, అధికశాతం పిండిపదార్థాలను కలిగి ఉంటుంది.ఈ పిండి పదార్థం అధికంగా తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అధికంగా పెరగటమే కాకుండా, శరీర బరువును కూడా పెంచుతుంది.

రోటి తయారు చేసుకోవడానికి అవసరమయ్యే పిండిని వివిధ రకాల తృణధాన్యాలతో కలిపి తయారు చేస్తారు.ఇందులో కూడా అధికశాతం కార్బోహైడ్రేట్లను కలిగి ఉండటం వల్ల అన్నం, చపాతి రెండు ఒకే విధమైన పోషకాలను అందిస్తాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కాబట్టి మనం తీసుకునే ఆహార విషయంలో రోజుకు సరిపడా క్యాలరీలను మాత్రమే తీసుకోవడం ద్వారా శక్తిని కోల్పోకుండా, శరీర బరువు పెరగకుండా తోడ్పడతాయి.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కనీసం 60 శాతం పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవడం ద్వారా బరువు తగ్గటానికి వీలుగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు