ప‌ర‌గ‌డుపున మిరియాలు తీసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్‌!

మిరియాలు వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

క్వీన్ ఆఫ్ స్పైసెస్ గా పిలువబడే మిరియాలు ఘాటైన రుచి, వాస‌న‌తో పాటు బోలెడ‌న్ని పోష‌కాలు కూడా క‌లిగి ఉంటాయి.

కాల్షియం, ఐర‌న్‌, సోడియం, జింక్‌, ఫాస్ప‌ర‌స్‌, మెగ్నీషియం, పొటాషియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, విట‌మిన్ బి, విట‌మిన్ కె, ప్రోటీన్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు మిరియాల్లో ఉంటాయి.అందుకే మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ముఖ్యంగా ప‌ర‌గ‌డుపున మిరియాలు తీసుకుంటే మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

సాధార‌ణంగా పిల్ల‌ల‌, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య మ‌ల‌బ‌ద్ధ‌కం.అయితే ఓ గ్లాస్ నీటిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మ‌రిగించి ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో సేవించాలి.

Advertisement
Benefits Of Taking Black Pepper In Early Morning! Benefits Of Black Pepper, Blac

ఇలా చేస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యే ఉండ‌దు.

Benefits Of Taking Black Pepper In Early Morning Benefits Of Black Pepper, Blac

అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా మిరియాల పొడి మ‌రియు బెల్లం వేసి క‌లిపి ఉద‌యాన్నే తీసుకుంటే శ‌రీరానికి బోలెడంట ఎన‌ర్జీ ల‌భిస్తుంది.దాంతో మీరు రోజంతా యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉంటారు.వేడి నీటిలో చిటికెడు మిరియాల పొడి క‌లిపి ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

ఫ‌లితంగా, మీరు స్లిమ్‌గా స‌న్న‌జాజి తీగ‌లా మార‌తారు.ఆందోళన, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ మిరియాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.ఉద‌యాన్నే మిరియాల టీ తీసుకుంటే మైండ్ రీఫ్రెష్ అవుతుంది.

దాంతో ఒత్తిడి, ఆందోళ‌న, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య దూరం అవుతాయి.ఇక మిరియాలు వేసి మ‌రిగించిన నీటిని ఉద‌యాన్నే తీసుకుంటే.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Advertisement

తాజా వార్తలు