గుమ్మడి గింజలు తినడం వలన ఎన్ని లాభాలో తెలుసా..?

మనం గుమ్మడి గింజలను అప్పుడప్పుడు తింటూ ఉంటాం.

గుమ్మడికాయ గింజలను తిన్నట్లయితే జింక్, మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులను వంటి ఇతర పోషకాలను గణనీయమైన పరిమాణంలో మనకు అందిస్తాయి.

వీటిలో ఐరన్ విటమిన్-B లు గొప్ప మూలలుగా కలిగి ఉంటాయి.గుమ్మడికాయ గింజలలో ఆరోగ్యకరమైన క్రొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కోసం బెస్ట్ సోర్స్ గుమ్మడి గింజలే.ఈ ఆసిడ్స్ బాడీకి అవసరమైన ఆసిడ్స్ లో ఒకటి.

Pumpkin, Seeds, Health ,Pumpkin Seeds Health Benefits-గుమ్మడి గ

కానీ, బాడీ ఈ ఆసిడ్స్ ని తనంతట తాను ప్రొడ్యూస్ చేసుకోలేదు.స్త్రీ - పురుషులిద్దరూ పోషకాలు కలిగిన గుమ్మడికాయ గింజలను అల్పాహారంగా ఆస్వాదించవచ్చునన్నారు.

కఠినమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల, నిద్రలేమి, పనిభారం వల్ల చాలా మంది అధిక ఒత్తిడికి గురవుతున్నారు.ఈ ఒత్తిడిని జయించడానికి ఒక పవర్ ఫుల్ ట్రీట్మెంట్ లా గుమ్మడి గింజలు పనిచేస్తాయి.

Advertisement

ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు పుష్కలంగా ఉండటం చేత ఇవి, అలసట, ఒత్తిడి, ఇతర సంబంధిత సమస్యలను నివారిస్తుందన్నారు.గుమ్మడి గింజల నించి కావాల్సినంత ఫైబర్ లభిస్తుంది.

ఓస్టియోపోరోసిస్ ఈ వ్యాధితో బాధపడుతున్న వారు తప్పని సరిగా గుమ్మడి గింజలను తీసుకోవడం మంచిదన్నారు.వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన గుమ్మడి గింజల్లో అత్యధికంగా జింక్ ఉండటం వల్ల ఇది, ఎముకలకు చాలా మేలు చేస్తుందన్నారు.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందని బోలు ఎముకల వ్యాధితో పోరాడుతుందని తెలిపారు.గుమ్మడి గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.ఫ్రీ రాడికల్స్ సెల్ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తాయన్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

గుమ్మడి గింజల వల్ల ఈ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేయవచ్చునని నిపుణులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు