వేప విత్తనాలను చూర్ణం చేసి మంచినీటిలో కలిపి తాగితే.. మంచి ఆరోగ్యం మీ సొంతం..

వేప ( Neem ) అన్నది ఒక దివ్య ఔషధం లాంటిదని మనందరికీ తెలిసిందే.

ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం( Ayurvedam ) ప్రకారం వేప అన్ని ఔషధాల్లో కెల్లా రారాజు అని చెప్పవచ్చు.

వేపలో ఎన్నో నమ్మశక్యం లేని ఔషధ గుణాలు ఉన్నాయి.వేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

వేపాకు క్యాన్సర్ కణాలను( Cancer Cells ) నాశనం చేయడంలో సహాయపడుతుంది.అలాగే శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక చాలామందికి చర్మ సమస్యలు వస్తూనే ఉంటాయి.అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల సబ్బులను, క్రీమ్లను వాడుతూ ఉంటారు.

Advertisement

అయితే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కేవలం అప్పటికప్పుడు జరిగే ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.కానీ ఆయుర్వేదం వల్ల మనకు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

చర్మ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసే ముందు వేపాకును పేస్టులాగా తయారు చేసుకుని శరీరానికి రుద్దుకొని కాసేపు ఆ పేస్టు ఆరాక స్నానం చేస్తే అది బాగా పనిచేస్తుంది.

ఎందుకంటే వేపాకులో యాంటీబ్యాక్రియల్ లక్షణాలు ఉన్నాయి.ఇది మన శరీరంపై మొటిమలు, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమున్నా కూడా దూరం చేస్తుంది.అంతే కాకుండా చాలా మంది దెబ్బ తగిలినప్పుడు కూడా వేపాకులు పేస్టులా చేసి పెడతారు.

ఎందుకంటే వేపరసంలో యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ సెప్టిక్ ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి.ఇవి దెబ్బను వెంటనే మానేయడానికి ఉపయోగపడతాయి.ఇక వేప జ్యూస్ తాగితే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మధుమేహం వ్యాధిని నిరోధించడానికి వేపాకులను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే వేప విత్తనాలను నలగొట్టి మంచినీటిలో కలిపి దాన్ని వడగట్టి వచ్చే రసం తాగితే కడుపులో ఉన్న పురుగులు నాశనం అవుతాయి.అంతేకాకుండా వేప విత్తనాల ద్వారా మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది.

Advertisement

అలాగే దంత సమస్యలు నయం చేయడానికి వేప బెరడు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

తాజా వార్తలు