మ‌క‌ర సంక్రాంతి మ‌హ‌త్మ్యం వెనుకనున్న భీష్మ పితామ‌హుడు, భ‌గీర‌థుని గాథ‌లివే...

హిందూధ‌ర్మంలో సూర్య భగవానుడికి సంబంధించిన అనేక పండుగలను జరుపుకునే సంప్రదాయం ఉంది.అందులో మకర సంక్రాంతి ఒకటి.

 Behind The Greatness Of Makara Sankranti , Makara Sankranti, Bhishmapithamahudu,-TeluguStop.com

మకర సంక్రాంతి రోజున చేసే స్నానం, ధ్యానం, దాన ధర్మాలకు గ‌ల‌ ప్రాముఖ్యతను ప‌లు గ్రంథాల‌లలో వివ‌రించారు.పురాణాలలో మకర సంక్రాంతిని దేవతల రోజుగా అభివర్ణించారు.

ఈ రోజు చేసే దానం వందరెట్లు ఫ‌లితాన్నిస్తుంద‌ని హిందువులు నమ్ముతారు.సంక్రాంతి పండుగ ప్రకృతితో పాటు జీవనశైలిలో కొత్త మార్పున‌కు సంకేతం.

ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరి 14న జరుపుకుంటున్నప్పటికీ, ఈసారి మకర సంక్రాంతి పండుగను జనవరి 15న జరుపుకుంటున్నాం.వాస్తవానికి మకర సంక్రాంతి తేదీ జనవరి 14 రాత్రి 8:42 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ సందర్భంలో మకర సంక్రాంతిని ఉదయ‌మున్న‌ తిథి ఆధారంగా జనవరి 15న జరుపుకుంటారు.సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి.ఆరోజు దానధర్మాలకు శుభప్రదమైన తేదీ.మకర సంక్రాంతి అంటే దేవతల రోజు.

ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్ర‌వేశిస్తాడు.శాస్త్రాలలో ఉత్తరాయణ కాలాన్ని దేవతలకు పగలు అని, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి అని అంటారు.

మకర సంక్రాంతి ఒక విధంగా దేవతలకు ఉదయం.అందుకే ఈ రోజున చేసే స్నానం, దానం, జపం, తపస్సు, శ్రాద్ధం, కర్మలు చాలా ముఖ్యమైనవి.

Telugu Bhagiratha, Greatness, Kapila Muni, Sankranti-Latest News - Telugu

సంక్రాంతి చరిత్ర ఇదే.మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడుతున్నప్పుడు భీష్మ పితామహుడు అర్జునుడి బాణాలకు గాయపడి వీర‌గ‌తి పొందాడు.మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి మకర సంక్రాంతిని ఎంచుకున్నాడు.ఒకరోజు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు, ద్రౌపది అందరూ కలిసి భీష్మ‌పితామ‌హుడిని కలవడానికి వెళ్ళారు.

పాండవులు భీష్ముని ర‌గ్గ‌ర‌కు రాగానే భీష్ముడు వారికి ధ‌ర్మం, అధర్మం, రాజకీయాల గురించి తెలియ‌జేశాడు.ఆ సమయంలో ద్రౌపది భీష్ముని అడిగింది… ఈరోజు మీరు విజ్ఞానం గురించి, ధ‌ర్మం గురించి చాలా చెబుతున్నారు.

అయితే అంద‌రూ ఉన్న‌ సభలో నన్ను అవ‌మానించిన‌ప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు ధ‌ర్మం గురించి తెలుసు.

Telugu Bhagiratha, Greatness, Kapila Muni, Sankranti-Latest News - Telugu

అయినా మీకు నాకు ఎందుకు సహాయం చేయలేదు? భీష్మ పితామహుడు ద్రౌపదితో… నాకు తెలుసు.ఏదో ఒక రోజు నేను ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి వ‌స్తుంద‌ని… ఆ రోజున నేను దుర్యోధనుడు పెట్టిన‌ ఆహారం తింటున్నాను, నేను తప్పుడు వ్యక్తుల సహవాసంలో చిక్కుకున్నాను.దుర్యోధనుడికి ఇచ్చిన ఆహారం పాపపు పనుల ద్వారా సంపాదించిన‌ది.

అటువంటి కలుషిత ఆహారం, తప్పుడు సహవాసం కారణంగా, నేను దుర్యోధనుని అధీనంలో ఉన్నాను.అందుకే ఆ రోజు నేను నీకు సహాయం చేయలేకపోయాన‌ని అన్నాడు.

బాణాలశ‌య్య‌పై పడుకున్న బీష్మ‌పితామ‌హుడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ, మకర సంక్రాంతి నాడు ప్రాణత్యాగం చేశాడు.మకర సంక్రాంతి రోజున గంగాన‌ది కపిల ముని ఆశ్రమం మీదుగా ప‌య‌న‌మై సముద్రంలో క‌లిసింది.

ఆ రోజున సూర్య భగవానుని పూజించడం వల్ల ప్రతి ఒక్కరికీ మోక్షం కలుగుతుందని హిందువుల ప్ర‌గాఢ న‌మ్మ‌కం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube