ఇప్పుడు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది.బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లైసెన్స్ తీసుకోవాలన్నా, ఏ పధకాలు తీసుకోవాలన్నాగాని ఆధార్ కార్డు ముఖ్యమైన ప్రూఫ్ గా మారిపోయింది.
ప్రతిదీ కూడా ఆధార్ తో అనుసంధానం అయిపోయింది.ఆధార్ కార్డులో మీకు సంబంధించిన, మీ వ్యక్తిగత వివరాలు ఉంటాయి కాబట్టి ఆధార్ నెంబర్ ను, సంబంధిత ఓటిపిలను గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఎప్పటికప్పుడు మీ ఆధార్ ను అప్డేట్ చేయించుకోండి.దానితో పాటు ఆధార్ ఆన్‌లైన్ సేవలను పొందడానికి మీరు ఆధార్ కి ఫోన్ నంబర్ తో పాటు మీ ఇమెయిల్ ఐడిని కూడా లింక్ చేయించాలి.
రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరి లేదంటే ఆధార్ నెంబర్ తో సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఎప్పటికప్పుడు మీ ఫోన్ నెంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.అలాగే మీ లేటెస్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఆధార్ నెంబర్ తో కరెక్ట్ గా అనుసంధానం అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలానో కూడా కింద తెలుపబడింది.
https://resident.uidai.gov.in/verify-email-mobile లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.అలాకాకుండా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://uidai.gov.in/ అనే లింక్ ఓపెన్ చేసిన తరువాత ఆ పేజ్ లో మీకు మై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేయండి.ఆ తరువాత మీకు ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈమెయిల్/మొబైల్ నంబర్ ను వెరిఫై చేయండి అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి.
అప్పుడు మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ ని అక్కడ నమోదు చేయాలిసి ఉంటుంది.ఆ తరువాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ గాని లేదా మీ ఈమెయిల్ అడ్రెస్ గాని ఎంటర్ చేయండి.
ఆ తరువాత అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీరు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ యూఐడీఏఐ రికార్డ్ ల్లోని నంబర్ తో మ్యాచ్ అయితే మీ నెంబర్ కి ఓటీపీ వస్తుంది.అలాగే స్క్రీన్ పై మీ నంబర్ ఆల్రెడీ వెరిఫై అయిందని ఒక మెసేజ్ వస్తుంది.అలాగే ఆ నెంబర్ మ్యాచ్ కాకపోతే తప్పు నెంబర్ అని మెసేజ్ వస్తుంది.
అప్పుడు మీరు మీకు సమీప దూరంలో ఉన్నా ఆధార్ సెంటర్ కి వెళ్లి మీ ఫోన్ నంబర్ ను మీ ఆధార్ కి లింక్ చేయించుకోండి.అయితే ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగిన వ్యక్తి వేలిముద్రలు తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి.వ్యక్తి లేకుండా ఆన్లైన్ చేయడం అంటే కుదరని పని.మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఆధార్ కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోండి.